close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

చుక్కలు విడివడుతున్నాయ్‌

జిల్లాలో భూముల ఇబ్బందులపై జేసీ దృష్టి

ప్రతి శుక్రవారం పరిశీలన

పెళ్లకూరు: శిరసనంబేడులో చుక్కల భూములు

ఈనాడు, నెల్లూరు: చుక్కల భూముల చిక్కులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దశాబ్ధాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు పడుతున్నాయి.జిల్లాలో చుక్కల భూముల వ్యవహారంపై ఆరునెలల క్రితమే కసరత్తు మొదలైంది. అప్పటి అధికారులు ఫిర్యాదులను జిల్లా కేంద్రానికి తెప్పించుకుని పరిష్కరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కలెక్టర్‌ శేషగిరిబాబు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపించారు. అయితే, దీనివల్ల సమస్యకు వెంటనే పరిష్కారం దొరికే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారు. ఇటీవల జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలోనూ ఈ అంశాన్ని చర్చలో ఉంచగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తామూ ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టనున్నట్లు కలెక్టర్‌ ఆ సందర్భంగా ప్రకటించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన కసరత్తే మొదలైంది. ఎన్నికల అనంతరం తహసిల్దార్లు, ఆర్డీవోల బదిలీలు జరిగిన క్రమంలో జిల్లాలో రెవెన్యూ అంశాలపై పట్టున్న ముగ్గురితో జేసీ వినోద్‌కుమార్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఓ డిప్యూటీ తహసీిల్దార్‌తో పాటు ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లు ఇందులో ఉన్నారు. ఈ బృందం ప్రతి శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. తొలుత తీవ్రత ఎక్కువగా ఉన్న మండలాలను ఎంచుకుని పరిష్కారం చేపట్టారు. ఇప్పటికే కావలి, ఆత్మకూరులో ప్రక్రియ పూర్తికాగా.. నేడు వెంకటాచలంలో నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. మరోవారం చేజర్లలో జరిపేలా ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలుస్తోంది.

లోతైన అధ్యయనం

చుక్కల భూములకు సంబంధించి అధికార బృందం లోతైన అధ్యయనం చేస్తున్నారు. ప్రధానంగా నిబంధనల్లో పేర్కొన్నట్లు 2005 నుంచి 2017 వరకు పన్నెండేళ్ల పాటు భూమి ఎవరి సాగులో ఉందన్నది తెలుసుకుంటున్నారు. అనంతరం ఆర్‌హెచ్‌ వివరాలను పరిశీలించడంతో పాటు.. ఏటా ఫసలీలో సదరు సర్వేనంబరుకు సంబంధించి నమోదైన వివరాలను అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ఇలా అన్ని అంశాలను క్రోడీకరించిన అనంతరం అర్హుల వివరాలను తేల్చి ఆ మేరకు పరిష్కార నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు. ఒక్కో పర్యటనలో కనీసం 200 దరఖాస్తులను పరిష్కరిస్తున్నారు. అయితే, ఈ ప్రక్రియలో అధికారులకు కొన్ని భిన్న పరిస్థితులు ఎదురవుతున్నట్లు సమాచారం. ఎవరి ఆధీనంలో లేకుండా ప్రభుత్వభూమిగా డైక్లాట్‌లో నమోదై ఉన్న చుక్కలభూములు తమకు చెందుతాయంటూ కొందరు అభ్యర్థిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ అధికారులు అప్రమత్తంగా ఉండి అభ్యర్థన తిరస్కరించినా, మరో మండలం నుంచి అదే వ్యక్తులు వివిధ సర్వే నెంబర్ల ద్వారా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై జిల్లా సంయుక్త కలెక్టర్‌ వినోద్‌కుమార్‌తో ‘ఈనాడు’ మాట్లాడగా.. చుక్కల భూముల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కావలి, ఆత్మకూరులో కార్యక్రమం నిర్వహించామన్న ఆయన.. మున్ముందు వెంకటాచలం, చేజర్లలో చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.