close

మంగళవారం, జనవరి 21, 2020

ప్రధానాంశాలు

స్వీయ రక్షణకు కరాటే ఆయుధం

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: స్వీయరక్షణకు ప్రతి ఆడపిల్లకు కరాటే నేర్చుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. సుమన్‌ షొటోకాన్‌ అకాడమీ ఆఫ్‌ ఇండియా, రాష్ట్ర కరాటే సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు డీఆర్‌ఆర్‌ఎంసీ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న డాక్టర్‌ వైఎస్సార్‌ స్మారక జాతీయ ఓపెన్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌ ప్రారంభ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ ఇటీవల తెలంగాణాలో జరిగిన దిశ సంఘటనను చూసిన తరవాత ఒంటరిగా బయటకు వెళ్లే ఆడపిల్లలకు సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఎంత అవసరమో అర్థమవుతుందన్నారు. నేర ప్రవృత్తి కలిగిన మృగాళ్ల నుంచి ఆత్మ రక్షణకు కరాటే ఒక ఆయుధంగా తోడ్పడుతుందని చెప్పారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని సూచించారు. ఆడపిల్లలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు నివారించేందుకు ఒక పటిష్ఠమైన చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవడం ద్వారా ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం పెరిగి ధైర్యంగా ముందుకెళ్లగలుగుతారన్నారు. కరాటే బ్రాండ్‌ అంబాసిడర్‌, ప్రముఖ సినీ నటుడు సుమన్‌ మాట్లాడుతూ కరాటే నేర్చుకున్న వారికి శరీరంలో ప్రతి భాగం ఒక ఆయుధంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి కరాటే ఆవశ్యకతను వివరించి పాఠశాలల్లో నేర్పేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడారు. పోటీలను ప్రారంభించిన పుష్పశ్రీవాణి, వాసిరెడ్డి పద్మలు కొద్దిసేవు కరాటే విన్యాసం చేసి క్రీడాకారులను ఉత్సాహపరించారు. రాష్ట్ర కరాటే సంఘం అధ్యక్షుడు కె.ప్రతాప్‌కుమార్‌, బి.సైదులు, పోటీల నిర్వాహకులు చిన్నపురెడ్డి, ఎస్‌.కాత్యాయిని, సత్య, లక్ష్మీసామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు అండర్‌-10, 12, 14 బాలబాలికల కటా, కుమితే విభాగాల్లో పోటీలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.