close

సోమవారం, జనవరి 27, 2020

ప్రధానాంశాలు

పల్లెలు, పట్టణాభివృద్ధికి చర్యలు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

తొర్రూరు టౌన్‌, న్యూస్‌టుడే: పల్లెలు, పట్టణాలు సమగ్రంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం పురోగతి దిశగా దూసుకుపోతుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులోని ఎల్‌వైఆర్‌ గార్డెన్‌లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తొర్రూరులో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 500 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం దుకాణాల వద్ద చెత్త, ప్లాస్టిక్‌ వస్తువుల ఉంటే రూ.10 వేల జరిమానా, కిరాణా దుకాణాల ముందు చెత్త ఉంటే రూ.5 వేలు, ఇళ్ల ముందు ఉంటే రూ.500 జరిమానా విధిస్తామన్నారు. మురుగుకాలువలు, వీధిదీపాలు, మంచినీటి సమస్య రాకుండా చూసుకోవాలని సూచించారు. పెండింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. వారంలో తొర్రూరుకు 15 ఆటోలు అదనంగా అందజేస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ సీహెచ్‌. శివలింగయ్య మాట్లాడుతూ.. డివిజన్‌ కేంద్రంలో 16 వార్డులలో సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ప్లాస్టిక్‌ రహిత మున్సిపాలిటీగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. సమావేశంలో ఆర్డీవో ఈశ్వరయ్య, డీఎస్పీ వెంకటరమణ, మున్సిపల్‌ కమిషనర్‌ గుండె బాబు, ఎంపీపీ తూర్పాటి చిన్నఅంజయ్య, జడ్పీటీసీ సభ్యుడు మంగళంపల్లి శ్రీనివాస్‌తోపాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

సెంట్రల్‌ లైటింగ్‌ ప్రారంభం..

అనంతరం రూ.2 కోట్లతో నూతనంగా అమర్చిన సెంట్రల్‌ లైటింగ్‌ను మంగళవారం రాత్రి మంత్రి దయాకర్‌రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నూతన సెంట్రల్‌ లైటింగ్‌ తొర్రూరుకు ఎంతో ఉపయోగకరమన్నారు. అనంతరం సిటిజన్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డివిజన్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్‌ శిక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.