close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

క్రైమ్

నకిలీ వెబ్‌సైట్లపై లోతుగా దర్యాప్తు

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం దేవస్థానానికి చెందిన ఆన్‌లైన్‌ సేవలను కొందరు అనధికార వెబ్‌సైట్ల ద్వారా బుకింగ్‌ చేస్తున్నట్లు వెలుగు చూడటంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అన్నవరం దేవస్థానానికి ప్రత్యేకంగా అధికారికంగా www.annavaramdevasthanam.nic.in వెబ్‌సైటు ఉంది. దేవస్థానానికి సంబంధించి నకిలీ వెబ్‌సైట్లు తెరపైకి తేవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయ అధికారులు కాకినాడ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అన్నవరం ఎస్సై మురళీమోహన్‌, కాకినాడ సైబర్‌ క్రైమ్‌ సిబ్బంది మంగళవారం సాయంత్రం అన్నవరం వచ్చి ఆ విభాగ సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఆలయ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్న అనధికార వెబ్‌సైట్లు www.eprarthana.com, www.epuja.co.in,www.edarshan.orgలను పరిశీలించారు. ఈ వెబ్‌సైట్ల ద్వారా ఏఏ పూజలు అందుబాటులో ఉంచారు, ఎంత నగదు వసూలు చేయడానికి ఇందులో పొందుపర్చారు, ఆ నగదు ఎవరి ఖాతాలోకి వెళ్తుందన్న దానిపై కూడా దృష్టి సారించినట్లు సమాచారం. సాంకేతిక నిపుణులు కూడా పరిశీలన చేయడానికి నేడు అన్నవరం రానున్నారు. అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు, దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ నకిలీ వెబ్‌సైట్లు ఓపెన్‌ చేస్తే ఇతర ఆలయాల వివరాలు కూడా ఉండటం గమనార్హం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.