close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రేపటి నుంచి 4 పంచాయతీల్లో లాక్‌డౌన్‌

తిరుచానూరు పోలీసుస్టేషన్‌లో చర్చిస్తున్న సీఐ సుధాకర్‌రెడ్డి

తిరుపతి(నగరం), మంగళం, న్యూస్‌టుడే: తిరుపతి గ్రామీణ మండలం పరిధిలోని నాలుగు పంచాయతీల్లో కరోనా కేసులు 20కిపైగా నమోదు కావడంతో రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ విధించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా తిరుచానూరు, పద్మావతిపురం, అవిలాల, శెట్టిపల్లి పంచాయతీల పరిధిలో ఈనెల 15 నుంచి లాక్‌డౌన్‌ అమలు చేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంట వరకు మాత్రమే నిత్యావసర వస్తువుల దుకాణాలు తెరిచి ఉంచనున్నారు. ఆ సమయంలో ప్రజలందరూ భౌతికదూరం పాటిస్తూ వస్తువులు కొనుగోలు చేయాలని ఎంపీడీవో సుశీలాదేవి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ అమలు కాలంలో మినహాయింపు సమయం తప్ప మిగిలిన సమయాల్లో ప్రజల రాకపోకలపై పూర్తిగా ఆంక్షలు అమల్లో ఉంటాయని సీఐ ఎం.సుధాకర్‌రెడ్డి తెలిపారు. తిరుచానూరు ముఖ ద్వారం సింధూ కూడలి వద్ద గ్రామంలోకి వచ్చే వాహనాలను నియంత్రించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి ఎం.జనార్దన్‌రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో అనుసరించాల్సిన విధి విధానాలపై సోమవారం సాయంత్రం తిరుచానూరు సీఐ సుధాకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి పోలీసుస్టేషన్‌లో చర్చించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.