close

బుధవారం, ఏప్రిల్ 08, 2020

ప్రధానాంశాలు

అదుపుతప్పి వైద్యుడిని ఢీకొన్న కారు

డ్రైవర్‌కు మూర్ఛ రావడంతో ప్రమాదం

రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే: నీలోఫర్‌ ఆసుపత్రిలో ఆవరణలో కారు వెనక్కి తీస్తుండగా డ్రైవర్‌కు అకస్మాత్తుగా మూర్ఛ రావడంతో అదుపు తప్పి ఓ వైద్యుడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ వైద్యుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో ఆసుపత్రి ప్రాంగణంలో జన సందోహం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. సంగారెడ్డికి చెందిన డ్రైవర్‌ లియాకత్‌ ఆలీ తన నలభై రోజుల శిశువుకు శ్వాసకోస, హృద్రోగంతో బాధ పడుతుండటంతో మంగళవారం అర్ధరాత్రి నీలోఫర్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో తన సొంతూరు సంగారెడ్డికి వెళదామని ఆయన ప్రాంగణంలో నిలిపిన తన కారును రివర్స్‌ తీయబోయాడు. అదే సమయంలో అతనికి మూర్ఛ రావడంతో ఎక్స్‌లేటర్‌ మీద కాలుపడి అదుపు తప్పింది. అప్పుడే విధుల్లోకి హాజరయ్యేందుకు వచ్చిన నిలోఫర్‌ ఆసుపత్రి యూనిట్‌-3లో పని చేసే హౌస్‌ సర్జన్‌ డాక్టర్‌ ప్రశాంత్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రశాంత్‌కు ఎడమ చేయి, కుడికాలు విరిగాయి. ఆయనకు నిమ్స్‌లో చికిత్స జరుగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.  లియాకత్‌ అలీకి ఆరేళ్ల క్రితం కూడా మూర్ఛ వచ్చింది. మంగళవారం రాత్రంతా నిద్రలేకపోవడం వల్లే మళ్లీ ఆ సమస్య వచ్చినట్లు వైద్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.