close

ఆదివారం, అక్టోబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దారి.. చూపగలరా..!

భారీ వర్షాలకు రూపుమారిన రోడ్లు

ఒక్క ఆర్‌ అండ్‌ బి పరిధిలోనే 100 కి.మీ. మేర అధ్వానం

న్యూస్‌టుడే, తాండూరు, వికారాబాద్‌ మున్సిపాలిటీ

వికారాబాద్‌ ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలో రోడ్డు పక్కన నిలిచిన నీరు

చిన్నపాటి వర్షం పడినా జిల్లాలోని రహదారులు గుర్తు పట్టలేనంతగా మారిపోతున్నాయి. ఏది గుంతో, ఏది రోడ్డో తెలియని స్థితిలో ప్రజలు, వాహనదారులు వెళ్లాల్సి వస్తోంది. వర్షాకాలంలో తరచూ కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు, భవనాల శాఖ పరిధిలోని రహదారులతో పాటు పంచాయతీ రాజ్‌శాఖ రోడ్లు సైతం అధ్వానంగా మారాయి. నిధులొస్తేగానీ మరమ్మతులు చేపట్టలేమని అధికారులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి న్యూస్‌టుడే కథనం.

ధ్వంసమైన వాటి తీరు

* తాండూరు నుంచి వికారాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారి 40 కిలో మీటర్ల పొడవునా ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌, జిల్లా కేంద్రం వికారాబాద్‌కు వెళ్లే రహదారి కావడంతో నిత్యం 6000 వాహనాలు రాకపోకలు నిర్వహిస్తున్నాయి. రహదారి మొత్తం అడుగడుగునా గోతుల మయంగా మారి వాహనాలు అదుపు తప్పుతున్నాయి.

గుంతల మయంగా తాండూరు- కొడంగల్‌ రహదారి

* తాండూరు పట్టణ సమీప ఎన్టీఆర్‌ కాలనీ, వైట్‌ప్యాలెస్‌ వద్ద ఎక్కడి కక్కడ గోతుల మయంగా మారింది. రాత్రివేళ ఒక వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టడంతో ప్రయాణంలో ఉన్న వారు ప్రాణాలు కోల్పోతున్నారు.

* తాండూరు నుంచి కర్ణాటక రాష్ట్రం చించోళి వరకు వెళ్లే ప్రధాన రహదారి చిందరవందరగా మారింది.


నందారం కౌడీడ్‌ రోడ్డు దుస్థితి

* రాష్ట్ర సరిహద్దుగా ఉన్న కొత్లాపూరు వరకు 16 కిలో మీటర్ల పొడవునా ఉంది. రహదారి మార్గంలోని గౌతాపూరు, అల్లాపూరు, సిరిగిరిపేట, జిన్‌గుర్తి గ్రామాల సమీపాల్లో ఎక్కడికక్కడ గుంతలు పడ్డాయి.

* పరిగి నియోజకవర్గంలో పరిగి నుంచి లక్నాపూరు రోడ్డు, నర్సయ్య గూడ నుంచి కుదానంద్‌, పరిగి నుంచి నంచర్ల, కుల్కచర్ల నుంచి చౌడాపూరు రహదారులు అడ్డదిడ్డంగా మారాయి.

రూ.40 లక్షలతో ప్రతిపాదనలు...

ఆర్‌ అడ్‌ బి ఏఈ లక్ష్మీనారాయణ, వికారాబాద్‌

రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వానికి రూ.40 లక్షలతో కూడిన ప్రతిపాదనలు పంపించాం. నిధులు వస్తే పనులు పూర్తిచేస్తాం.

త్వరలో బాగు చేస్తాం

బోగేశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్‌, వికారాబాద్‌

ఇటీవలి భారీ వర్షాలకు పట్టణంలోని రోడ్ల కంటే విలీనమైన గ్రామాల్లోని రోడ్లు దెబ్బతిన్నాయి. వీలైనంత త్వరగా మరమ్మతులు చేపడతాం.

నిధులు రావడమే ఆలస్యం

- శ్రీనివాస్‌, ఆర్‌ అండ్‌ బి ఉపకార్య నిర్వాహక ఇంజినీర్‌, తాండూరు

రహదారుల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. తాండూరు నియోజకరవ్గంలో 50 కిలో మీటర్ల రహదారుల మరమ్మతులకు రూ.12 కోట్లు అవసరమౌతాయి. నిధులు రాగానే పనులు ప్రారంభిస్తాం.

80 కి.మీ. పంచాయతీ రోడ్లు ధ్వంసం

- గోపీనాథ్‌, పంచాయతీ రాజ్‌ శాఖ డీఈఈ, తాండూరు

జిల్లా వ్యాప్తంగా పంచాయతీ రాజ్‌ శాఖ పరిధిలోని రహదారులు 80 కిలో మీటర్లకు పైగానే మరమ్మతుకు వచ్చాయి. వీటిని బాగు చేయడానికి కిలో మీటరుకు రూ.లక్ష చొప్పున నిధులు కావాలని ప్రతిపాదనలు వెళ్లాయి. ఒక్కో నియోజకవర్గంలో 10 కిలోమీటర్ల వరకు రహదారులు మరమ్మతుకు గురయ్యాయి.నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం.


పంచాయతీ రాజ్‌ శాఖ పరిధిలోని రహదారులు (కి.మీ.)

* సిమెంటు 46

* తారు 697

* కంకర 596

* మట్టి 1517

మొత్తం 2,856

ఆర్‌ అండ్‌ బి.పరిధిలోని రోడ్లు (కి.మీ)

* ఇందులో రాష్ట్ర పరిధి 47

* జిల్లా పరిధి 622.359

* ఇతర జిల్లాలవి 287.7

* నాలుగు వరుసలవి 4.965

* రెండు వరుసలవి 335.075

* మధ్యతరహావి 42.469

* ఒక వరుసవి 574.55

మొత్తం 957.059

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.