close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

ప్రధానాంశాలు

క్రీడీ నైపుణ్యాలకు మెరుగు

ఉత్తమ శిక్షణలకు పెరుగుతున్న ఆదరణ ●

ఔరంగాబాద్‌ క్రీడా శిక్షణ కేంద్రంలో ప్రవేశాలు

ఖమ్మం క్రీడలు, న్యూస్‌టుడే

అత్యుత్తమ క్రీడా శిక్షణకేంద్రాల్లో శిక్షణ పొందాలనుకునేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న శిక్షణకేంద్రాలను నెలకొల్పింది. ఇందులో ఒకటి మహారాష్ట్రలోని ఔరంగాబాదు నగరంలో ఏర్పాటైంది. ఇందులో ప్రవేశాలు కోరుకునే ఉభయ జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తులు పంపవచ్చు.

ఏయే క్రీడాంశాలు

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా పర్యవేక్షణలోని ఔరంగబాదు క్రీడాశిక్షణ కేంద్రంలో విలువిద్య, అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, ఫెన్సింగ్‌, హాకీ, వెయిట్‌లిఫ్టింగ్‌ అంశాలు ఉన్నాయి. ఇప్పటికే దేశంలో జరిగిన సబ్‌జూనియర్‌, జూనియర్‌ విభాగాల జాతీయ పోటీల్లో పాల్గొని ఎనిమిదో స్థానం వరకు ప్రతిభను నిరూపించుకున్న క్రీడాకారులకు ఈ కేంద్రంలో జరిగే ఎంపికల్లో పాల్గొనేందుకు అర్హులు. ప్రవేశం పొందిన క్రీడాకారులకు దీర్ఘకాలం పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలు, సదుపాయాలతో శిక్షణ ఇస్తున్నారు. ఖమ్మం నగరానికి చెందిన ఇద్దరు వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారిణులు ప్రవేశం పొంది ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు.

సంప్రదించే చిరునామా

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ, ఔరంగాబాద్‌లో సంప్రదించాలి. వ్యక్తిగతంగా క్రీడాంశాల వారిగా వివరాలు కావాలనుకునే వారు ఆయా క్రీడాంశాల బాధ్యులను సంప్రదించవచ్ఛు విలువిద్య సి.ఆర్‌.కుర్మీ (98347 88760), పునీత్‌కుమార్‌ (90130 39738), అథ్లెటిక్స్‌ ఉమేశ్‌లోహ్ర (95463 37728), బాక్సింగ్‌ డి.ధనోరలాల్‌ (98952 93160), సన్ని (89011 77788), ఫెన్సింగ్‌ తుకారాం మెహత్ర (70956 61161), నితీశ్‌నావ్‌ (84274 70001), హాకీ సురేశ్‌అధిన (94490 85684), వెయిట్‌ లిఫ్టింగ్‌ హన్సాశర్మా (83848 10850), అకకేశ్‌బారువ (79861 53189) నెంబర్లకు సంప్రదించాల్సి ఉంటుంది. సూచనలు, సలహాలు, ఇతర సమాచారం కోసం ఖమ్మం పటేల్‌ స్టేడియంలోని జిల్లా యువజన క్రీడల కార్యాలయంలో అధికారి పరంధామరెడ్డి, శిక్షకులను సంప్రదించవచ్ఛు ఆయా క్రీడాంశాలకు చెందిన జిల్లా సంఘాల వద్ద కూడా సమాచారం ఉంది.

ఉభయ జిల్లాల్లో..

ఉభయ జిల్లాల్లో విలువిద్య, అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ అంశాల్లో జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులు ఉన్నారు. ఏటా సబ్‌జూనియర్‌, జూనియర్‌ విభాగాల్లో జాతీయస్థాయిలో 300 మంది క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. వీరిలో పతకాల పట్టికలో ముందు వరుసలో ఉన్నవారు అథ్లెటిక్స్‌, విలువిద్య, వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగాల్లో ఉన్నారు. ఈ అంశాల్లో మొదటి మూడు స్థానాల్లో రాణించిన వారు మాత్రమే మెరుగైన అవకాశాల కోసం వెతుకుతున్నారు. ఎనిమిదో స్థానం వరకు రాణించిన వారికి మరింత మెరుగైన శిక్షణలు ప్రభుత్వం అందుబాటులో ఉన్నాయి. ఈ విషయం చాలామందికి తెలియడంలేదు. వెయిట్‌ లిఫింగ్‌ క్రీడాకారులు మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే ఖమ్మం నుంచి సాహితి, అనూష శిక్షణలో ఉన్నారు.

వయస్సు నిబంధనలు

ఈ ఏడాది ఏప్రిల్‌ నెల 4వ తేదీ నాటికి అథ్లెటిక్స్‌లో 12 నుంచి 23, విలువిద్య, బాక్సింగ్‌, ఫెన్సింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ 12 నుంచి 23, హాకీ 12 నుంచి 20 సంవత్సరాలు వయస్సు కల్గినవారు అర్హులు.

దరఖాస్తు చేసుకునేందుకు..

జనన ధ్రువీకరణ, జాతీయ క్రీడల్లో ప్రతిభా ప్రమాణ ధ్రువపత్రాలు, స్థానికత ధ్రువీకరణ, నాలుగు ఫొటోలు, విద్యార్హతలు ఎంపికల సమయంలో దగ్గర ఉంచుకోవాలి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.