close

శనివారం, ఆగస్టు 15, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విద్యాలయాల్లో చోటు.. లాటరీతో పట్టు  

● గురుకుల, ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం


డోన్‌లోని గురుకుల పాఠశాల

క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యా బోధనతో పాటు పాఠ్యపుస్తకాలు, సమదుస్తులు, మధ్యాహ్న భోజన సౌకర్యం, డిజిటల్‌ తరగతుల నిర్వహణ, అనుభవజ్ఞులైన గురువులతో బోధన. శారీరక, మానసిక వికాసం పెంపొందించడానికి క్రీడలు, ఏటా విహార యాత్రలు ఆ విద్యాలయాల్లో అందుతాయి. ఇవన్నీ ఏదో కార్పొరేట్‌ విద్యాలయానికి సంబంధించినవి కావు..సర్కారుకు చెందిన ఆదర్శ, గురుకుల పాఠశాలల్లో వీటిని ఉచితంగా పొందవచ్ఛు పేద విద్యార్థులు వీటిలో చేరేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్ఛు

- న్యూస్‌టుడే, పత్తికొండ నాలుగుస్తంభాల కూడలి, డోన్‌ పట్టణం

జిల్లాలో గురుకులాల్లో 5వ తరగతి, ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతుల ప్రవేశానికి నోటిఫికేషన్‌ ఇప్పటికే వెలువడింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో గతంలో మాదిరిగానే లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. 2020- 21 ఏడాదికి గాను సీట్ల కేటాయింపు జరగనుంది. జిల్లాలో 36 ఆదర్శ పాఠశాలలు, 13 గురుకులాలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో రెండు సెక్షన్ల చొప్పున 80 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఒక్కో సెక్షన్‌లో 40 మంది విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. ప్రభుత్వం లేదా ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన పాఠశాలల్లో విద్యార్థుల్లో 3, 4, 5 తరగతుల్లో చదివి ఉండాలి. పేద విద్యార్థులకు ఇదో మంచి అవకాశం. నిర్ణీత తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.

నాణ్యమైన విద్య..మెరుగైన సౌకర్యం

ఆదర్శ, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంతో పాటు వసతి సౌకర్యాలు సైతం మెరుగ్గా ఉన్నాయి. గురుకులాల్లో బాలురు, ఆదర్శలో బాలికలకు వసతి గృహ సౌకర్యం ప్రభుత్వం కల్పించింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల మాధ్యమానికి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఆదర్శ, గురుకులాల్లో ప్రభుత్వం చదువు, వసతి ఏర్పాటు చేసింది. ఫలితంగా పేదలు తమ పిల్లలను చదివించేందుకు ఇదో మంచి అవకాశం.

అర్హులు ఎవరంటే..!

ఆదర్శ పాఠశాల: ఓసీ, బీసీ 01-09-2008 నుంచి 31-08-2010 మధ్య జన్మించి ఉండాలి, ఎస్సీ, ఎస్టీ 01-09-2006 నుంచి 31-08-2010 మధ్య జన్మించి ఉండాలి

గురుకుల పాఠశాల: ఓసీ, బీసీ 01-08-2009 నుంచి 31-08-2011 మధ్య జన్మించి ఉండాలి, ఎస్సీ, ఎస్టీ 01-08-2007 నుంచి 31-07-2011 మధ్య జన్మించి ఉండాలి

ఎంపిక విధానం

ఆదర్శ పాఠశాలలో రోస్టర్‌ విధానం ప్రకారం లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపిక విషయంలో ప్రధానాచార్యులకు ఎలాంటి అధికారాలు ఉండవు. జిల్లా విద్యాధికారి పర్యవేక్షణలో కొనసాగుతుంది. గురుకులంలో లాటరీలో ఎంపికైన విద్యార్థులను రిజర్వేషన్‌, స్థానికత, ప్రత్యేక కేటగిరి (మైనార్టీ, అనాథ, సైనికోద్యోగ పిల్లలు)లో అభ్యర్థి కోరిన పాఠశాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏదైనా ఒక రిజర్వేషన్‌ కేటగిరీలో అభ్యర్థులు లేకపోతే ఆ ఖాళీలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం భర్తీ చేస్తారు. ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు ఈ నెల 25వ తేదీవరకు దరఖాస్తు చేసుకోవచ్ఛు గురుకుల పాఠశాలల్లో ఈ నెల 20వ తేదీ వరకు అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.