close

బుధవారం, నవంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొండంత ముప్ఫు..!!

 శ్రీశైలంలో స్నాన ఘాట్ల వద్ద పొంచి ఉన్న ప్రమాదం..!

● 2016లో కూలిన కొండచరియలు

● తూతూమంత్రంగా చైన్‌ లింక్‌ మెష్‌

గతంలో శ్రీశైలం కొండచరియలు తవ్విన ప్రదేశం

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడిన ఘటనతో బుధవారం రాష్ట్రం యావత్తూ ఉలిక్కిపడింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పిపోయింది. ఈ ఘటన శ్రీశైల క్షేత్రంలోనూ ప్రకంపనలు రేపింది. ఇలాంటి చిన్నా చితకా ఘటనలు పాతాళగంగ, ఘాట్‌ రోడ్‌లో తరచూ జరుగుతూండడం ఆందోళన కల్గిస్తోంది. నాలుగేళ్ల క్రితం స్నాన ఘట్టాల వద్ద కొండచరియలు కూలినా తూతూమంత్రంగా నియంత్రణ చర్యలు తీసుకుని వదిలేశారు. భక్తుల ప్రాణాలకు ముప్పు అని తెలిసినా దేవాదాయశాఖ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. - న్యూస్‌టుడే, శ్రీశైలం ఆలయం, సున్నిపెంట సర్కిల్‌

శ్రీశైల క్షేత్రంలోని పాతాళగంగ స్నానఘట్టాల వద్ద కొండచరియలు ప్రమాదకరంగా ఉన్నాయి. 2011 బృహత్తర ప్రణాళికలో భాగంగా రూ.7 కోట్ల అంచనాతో స్నానఘట్టాల వద్ద దేవస్థానం అధికారులు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ నిధులతో స్నానఘట్టాల మెట్ల అభివృద్ధి, వాచ్‌ టవర్‌ ఏర్పాటు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదుల నిర్మాణం చేశారు. వాచ్‌టవర్‌ నిర్మాణం కోసం 2014-15 సంవత్సరాల్లో రోప్‌ వే పక్కన ఉన్న కొండను దేవస్థానం ఇంజినీర్లు తవ్వేశారు. కొండచరియలపై పంప్‌ హౌస్‌ నిర్మాణం కోసం తవ్వకాలు చేశారు. 2016 కృష్ణ్ణా పుష్కరాల సమయంలో భ్రమరాంబ ఘాట్‌ పేరుతో స్నానఘాట్లు నిర్మిస్తుండగా పై భాగాన ఉన్న కొండచరియ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనపై ఓ.ఎస్‌.డి స్థాయి అధికారులతో విచారణ చేస్తున్నట్లు అప్పటి ఎస్పీ రవికృష్ణ తెలిపారు. వెనువెంటనే అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్‌ అనురాధ ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. రూ.15 లక్షల అంచనాతో అప్పటి ఈవో భరత్‌ గుప్త విరిగిపడ్డ కొండచరియలకు చైన్‌ లింక్‌ మెష్‌ ఏర్పాటు పనులు ప్రారంభించారు. చైన్‌ లింక్‌ మెష్‌ ఏర్పాటు చేసినా కింద భాగంలో లింకులను పటిష్టంగా నిర్మించకుండా వదిలేశారు. ప్రస్తుతం అది నిర్లక్ష్యంగానే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చైన్‌ లింక్‌ మెష్‌ను పటిష్ట పరిచిన దాఖలాలు లేవు. ప్రస్తుతం విరిగిపడిన కొండచరియల రాళ్లు బీటలు ఏర్పడి ఉన్నాయి. అప్పడప్పుడు చిన్నపాటి రాళ్లు దొర్లి పడుతుంటాయి. భారీ బండరాళ్లు దొర్లిపడితే స్నాన ఘాట్‌లో వైపు నుంచి వెళ్లే భక్తులపై పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా దేవాదాయ శాఖ స్పందించి శ్రీశైలంలో స్నానఘట్టాల వద్ద కొండచరియలకు పటిష్టమైన చైన్‌ లింక్‌ మెష్‌ నిర్మించి ప్రమాదాలను నివారించాలని అవసరం ఎంతైనా ఉంది.

ఆనకట్ట వద్ద పొంచి ఉన్న ప్రమాదం

శ్రీశైలం జలాశయం వద్ద కూడా కొండచరియలు ప్రమాదకరంగా ఉన్నాయి. గత నెలలో ఆనకట్ట మార్గానికి వెళ్లే ప్రవేశద్వారం వద్దనే కొండచరియలు విరిగిపడ్డాయి. మూడు పెద్ద బండరాళ్లు దొర్లి పడ్డాయి. ఈ సమయంలో ఎవ్వరూ లేక పోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఆనకట్ట వద్ద నుంచి కుడిగట్టు జల విద్యుత్తు కేంద్రం వరకు కొండచరియలు ఎప్పుడు విరిగి పడతాయో తెలియని పరిస్థితి ఉంది. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జలాశయం గేట్లు తెరిని నీటిని విడుదల చేస్తుండడంతో నీటి తుంపర్లు ఎగిసిపడుతున్నాయి. వర్షం, తుంపర్ల వల్ల మట్టి జారిపోయి బండరాళ్లు దొర్లిపడే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంది. ప్రమాదకరంగా ఉన్న కొండచరియలను గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యం చేస్తే రహదారిపై వెళ్లే వాహనదారులపై పడే అవకాశం ఉంది.

ఈ మధ్యకాలంలో ఆనకట్ట వద్ద విరిగిపడ్డ కొండచరియలు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.