close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

ప్రధానాంశాలు

తపాలా బ్యాంకు సేవలు బాగు

ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్స్‌..

● ఆధార్‌, బయోమెట్రిక్‌తో నగదు

● పెరిగిన ఖాతాదారులు

మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలా శాఖలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొంటూ ఖాతాదారులకు ఉత్తమమైన సేవలందించడానికి సిద్ధమవుతోంది. ప్రైవేట్‌ రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకొని సేవా రంగంలో దూసుకుపోతోంది. తపాలా శాఖలో భాగమైన ఐపీపీబీ బ్యాంకులు అందుబాటులోకి రావడంతో ఆదరణ మరింత పెరిగింది. గ్రామీణ స్థా.యిలో ప్రజలకు సేవలందడంతో ఖాతాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఐపీపీబీ బ్యాంకు కొత్తగా ఆధార్‌ ఎనేబుల్డ్‌ సేవలు తీసుకురావడంతో ఈ సేవలను ఎక్కువగా వినియోగించుకొంటున్నారు.

జిల్లాలో నిజామాబాద్‌, ఆర్మూర్‌లో కలిపి రెండు ప్రధాన తపాలా కార్యాలయాలున్నాయి. వీటి పరిధిలో ఐపీపీబీ సేవలను 2018 సెప్టెంబరు 1న ప్రారంభించారు. తపాలా బ్యాంకు సేవలు అందుబాటులోకి వచ్చిన సమయంలో జిల్లాలో 7,186 బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఆరు నెలల తర్వాత ఆ సంఖ్య 38,950కు చేరింది. ఈ సంవత్సరం 75,400 సేవింగ్‌, 250 కరెంట్‌ ఖాతాలు ఉన్నాయి. జిల్లాలోని ప్రతి గ్రామంలో బ్యాంకు యాక్సెస్‌ పాయింట్లతో సేవలందిస్తున్నారు. వివిధ గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.

రూ.100తో ఖాతా ప్రారంభం

తపాలా బ్యాంకులో సేవింగ్స్‌ ఖాతాను రూ.100, కరెంట్‌ ఖాతా రూ.1000 చెల్లించి ప్రారంభించవచ్ఛు కేవలం ఆధార్‌ నంబరు, బయోమెట్రిక్‌ ద్వారా తీసుకొంటారు. అంతే నిమిషాల్లో ఖాతా ప్రారంభమవుతుంది. దీని వెంట క్యూఆర్‌ కార్డును అందజేస్తారు. కాగిత రహిత కార్యకలాపాలు నిర్వహించడానికి బయోమెట్రిక్‌ పద్ధతిని వినియోగిస్తున్నారు.

తపాలా బ్యాంకు సేవలు వినియోగించుకున్న  వారి వివరాలు...

నిజామాబాద్‌ జిల్లాలో

నగదు డ్రా చేసిన మొత్తం `.41,14,122

వినియోగదారులు 10,256

ఖాతాలు 75,400

ధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టం ద్వారా వినియోగదారుడు అకౌంట్‌ కలిగిన బ్యాంకుకు వెళ్లకుండానే గ్రామీణ తపాలా కార్యాలయాల్లోనే నగదు పొందవచ్ఛు ఇందుకు పాస్‌బుక్‌, ఖాతానెంబరు అవసరం లేదు. బ్యాంకు ఖాతాకు ఆధార్‌ అనుసంధానమై ఉంటే చాలు. ఖాతాదారుడు పోస్టాఫీస్‌కు వెళ్లి మొబైల్‌ నంబరు, ఆధార్‌ సంఖ్యను తెలిపితే బయోమెట్రిక్‌ పద్ధతిలో వేలిముద్ర తీసుకుంటారు. ఖాతాదారుడు ఇచ్చిన మొబైల్‌ నంబరుకు ఓటీపీ వస్తుంది.. ఓటీపీని కంప్యూటర్‌లో అప్‌లోడ్‌ చేయగానే బయోమెట్రిక్‌తో రూ.10వేల వరకు నగదు విత్‌డ్రా చేసుకోవచ్ఛు సేవలు వినియోగించుకున్నందుకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు.

న్యూస్‌టుడే, ఖలీల్‌వాడి, (నిజామాబాద్‌)

నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

శ్రావణ్‌కుమార్‌, ఐపీపీబీ సీనియర్‌ మేనేజర్‌, నిజామాబాద్‌

పాలా బ్యాంకు అందిస్తున్న సేవలను గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు నగరవాసులు సద్వినియోగపర్చుకోవాలి. ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా ఆధార్‌ ఎనేబుల్డ్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్‌ సేవలు ప్రారంభమైన నాటి నుంచి ఖాతాల సంఖ్య పెరుగుతోంది. ఐపీపీబీ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో అన్ని రకాల సేవలను పొందవచ్ఛు

సేవలు ఇలా..

●●● తపాలా బ్యాంకు అందిస్తున్న సేవలు కొత్త తరహాలో ఉన్నాయి. ఖాతాదారులు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఆన్‌లైన్‌ విధానంలో పని చేసేలా తయారు చేశారు. దీని వలన లావాదేవీలు నిర్వహించే సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటుంది.

●●● ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు అన్ని రకాల సేవలందిస్తోంది. వ్యక్తిగత ఖాతా నుంచి నగదు తీయాలన్నా, వేయాలన్నా, ఇంటి వద్ద నుంచే లావాదేవీలు నిర్వహించుకోవచ్ఛు

●●● క్యూఆర్‌ కార్డుల ద్వారా నఫె్ట్‌, ఆర్‌టీజీఎస్‌, ఐఎంపీఎస్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, బిల్లుల చెల్లింపులు ఇలా అనేక సేవలు పొందవచ్ఛు

●●● ఖాతాదారుడు ప్రతి రోజు రూ.లక్ష వరకు లావాదేవీలు నిర్వహించుకోవచ్ఛు

●●● తపాలా బ్యాంకు అందిస్తున్న అన్ని రకాల సేవలను పోస్టుమ్యాన్‌ ద్వారా ఇంటి వద్దనే పొందవచ్ఛు ఖాతాదారులు ఒక రోజు ముందు 155299 టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేస్తే సరి పోతుంది. చరవాణితో పాటు బయోమెట్రిక్‌ అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇంటి వద్ద నుంచే డబ్బులు తీసుకోవచ్ఛు

డబ్బులు తీసుకుంటున్న ఖాతాదారులు

ఐపీపీబీ యాప్‌ తప్పని సరి..

తపాలా బ్యాంకు సేవలు ఆన్‌లైన్‌ ద్వారా పొందటానికి ఐపీపీబీ యాప్‌ తప్పనిసరి. చరవాణిలో గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని రిజిస్ట్రేషన్‌ చేయాలి. డిజిటల్‌ సేవలన్నీ దీని ద్వారా పొందవచ్ఛు ఆర్డీ, సుకన్య వివిధ రకాల పథకాలకు సంబంధించిన నగదు పోస్టాఫీస్‌ వరకు వెళ్లకుండా ఇంటి నుంచే చెల్లించడానికి వీలుంది.

ప్రతిపాదనలకు స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు..

తపాలా బ్యాంకు సేవలు విస్తరించడం.. గ్రామీణ ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేయబోతుంది. అవే స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు. వీటికి సంబంధించిన నివేదికను అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఈ నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రకటన వస్తుందని అందరు ఎదురు చూశారు. కానీ ఎలాంటి ప్రకటన వెలువడక పోవడంతో మరి కొద్ది రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు అందుబాటులోకి వస్తే డ్వాక్రా, ముద్ర, కుటీర పరిశ్రమలకు రుణాలు అందిస్తారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.