close

శుక్రవారం, అక్టోబర్ 18, 2019

తాజా వార్తలు

మొక్కలు నాటినఅధికారులు

ఆదోనిమార్కెట్‌: పట్టణంలోని టీజీకేనగర్‌లో మంగళవారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పురపాలక కమిషనర్‌ రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు పురపాలక అధికారులు సామాజిక సంస్థల ప్రతినిధులతో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం మేనేజర్‌ వెంకటదాస్‌ మాట్లాడుతూ.. పట్టణంలో పచ్చదనం పెంపునకు 3 లక్షల మొక్కలు నాటేలా లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికీ ఒక మొక్కను పంపిణీ చేసి వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పచ్చదనం పెంపుతోనే మానవాళికి శ్రేయస్కరమన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక శానిటరీ ఇన్‌స్ఫెక్టర్‌ హరినాథ్‌, మేస్త్రీలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.