11 లారీల సీజ్‌ - Kurnool - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

తాజా వార్తలు

11 లారీల సీజ్‌

స్వాధీనం చేసుకున్న లారీలు

కర్నూలు (బుధవారపేట), న్యూస్‌టుడే: నాపరాయి ఖనిజాన్ని అక్రమంగా తరలిస్తున్న 11 లారీలను పట్టుకున్నట్లు గనులశాఖ డీడీ రాజశేఖర్‌ శుక్రవారం తెలిపారు. కర్నూలు ఆర్‌వీఎస్‌ దళం, డీడీ కార్యాలయ సిబ్బంది సంయుక్తంగా దాడులు చేసినట్లు పేర్కొన్నారు. తుగ్గలి మండల పరిధిలో వాహనాల తనిఖీ చేస్తుండగా నాపరాయిని తరలిస్తున్న 3 లారీలు, రాయల్టీ చెల్లించి పరిమాణం కంటే అధిక లోడుతో వెళ్తున్న 8 లారీలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ తనిఖీల్లో రాయల్టీ ఇన్‌స్పెక్టర్లు కొండారెడ్డి, బాలునాయక్‌, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.