విద్యుదాఘాతానికి రైతు బలి - Prakasam - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

తాజా వార్తలు

విద్యుదాఘాతానికి రైతు బలి

 
ప్రమాదస్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్‌.ఐ, సిబ్బంది

ధర్మవరం(అద్దంకి), న్యూస్‌టుడే: వరినారుమడికి నీరు పెట్టేందుకు ప్రయత్నించిన సన్నకారు రైతు మారం కాశిరెడ్డి(50) పొలం వద్దనే విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం అయిదు గంటల సమయంలో చోటు చేసుకుంది. ఎస్‌.ఐ ఎం.శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు ధర్మవరం గ్రామానికి చెందిన సన్నకారు రైతు కాశిరెడ్డి తన ఎకరం పొలంలో మాగాణి సాగుకు సిద్ధపడ్డారు. ఆదివారం సాయంత్రం పొలానికి వెళ్లారు. మోటారు స్విచ్‌ వేసిన తరువాత నీళ్ల గొట్టానికి పైపు తగిలించేందుకు ప్రయత్నించే క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. నీళ్ల గొట్టానికి బోరు తీగలు తగలడంతో విద్యుత్తు సరఫరా జరిగి ప్రమాదం చోటు చేసుకుంది. కొద్ది సేపటి తరువాత పశువుల కాపర్లు ఈ దృశ్యాలను గుర్తించి కుటుంబసభ్యులకు తెలిపారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే ఆయన మృతిచెందారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌.ఐ ఎం.శ్రీనివాసరావు సందర్శించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. మృతునికి భార్య కాశమ్మ, కుమార్తె, కుమారుడు వున్నారు. మృతదేహాన్ని సహకార సంఘం అధ్యక్షుడు చాగంటి రాజేంద్ర, గ్రామస్థులు సందర్శించి నివాళులు అర్పించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ సంతాపం తెలిపారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించిన తరువాత పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

 
కాశిరెడ్డి మృతదేహం

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.