close

శుక్రవారం, అక్టోబర్ 18, 2019

తాజా వార్తలు

మెట్రోస్టేషన్‌ పెచ్చులూడిపడి యువతి మృతి

హైదరాబాద్‌: అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌ ఆవరణలో ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రోస్టేషన్‌ పెచ్చులూడి పడడంతో మౌనిక కంతాల (24) అనే యువతి మృతిచెందారు. వర్షం కారణంగా మెట్రోస్టేషన్‌ కింద నిరీక్షిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతురాలిని కేబీహెచ్‌బీ వాసిగా గుర్తించారు.

ప్రమాద ఘటనపై హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి స్పందించారు. మెట్రో స్టేషన్‌లోని పై భాగంలోని ఓ సిమెంట్‌ ముక్క విరిగిపడిందని, ఆ ముక్క తాలుకా సూది మొన సుమారు 9 మీటర్ల ఎత్తు నుంచి మహిళ తలపై పడడంతో ఆమె ప్రమాదవశాత్తూ మృతిచెందారని పేర్కొన్నారు. మృతురాలు మౌనిక టీసీఎస్‌లో పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. మౌనిక కుటుంబానికి పరిహారం ఇవ్వాలని ఎల్అండ్‌ టీ సంస్థకు సూచించామన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.