close

గురువారం, నవంబర్ 14, 2019

తాజా వార్తలు

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి

మృతదేహాలను పరిశీలిస్తున్న ఎస్సై నాగేశ్వరరావు

అడ్డతీగల, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన శనివారం అడ్డతీగలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కె.గౌరీబాబు(30), కెచ్చెల లింగారెడ్డి(34) అడవి జంవుతులను వేటాడేందుకు ఉచ్చు తగిలించే పనిపై శుక్రవారం రాత్రి అడవికి వెళ్లారు. ఈ క్రమంలో వారు ఏర్పాటు చేసే విద్యుత్తు తీగలు తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. మరోవైపు మృతుల కుటుంబసభ్యులు వారి కోసం రాత్రంతా ఎదురు చూసి శనివారం ఉదయాన్నే వెతుకులాట చేపట్టారు. ఈ నేపథ్యంలో గ్రామ శివారు టేకు ప్లాంటేషన్‌ వద్ద మృతదేహాలను గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్సై నాగేశ్వరరావు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అడ్డతీగల ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మరోవైపు మేకలను మేపేందుకే తమ వారు అడవికి వెళ్లాని మృతుల బంధువులు చెబుతున్నారు.


ట్రాక్టర్‌ డ్రైవర్‌...

తుని: విద్యుదాఘాతంతో ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతిచెందిన ఘటన తుని పట్టణంలోని 23వ వార్డు రామకృష్ణాకాలనీలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై అజయ్‌బాబు వివరాల మేరకు విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం గొడిచర్లకు చెందిన గొర్లి సత్తిబాబు(40) నీళ్లట్యాంకుతో ఉన్న ట్రాక్టర్‌ను తీసుకువెళుతుండగా, ట్యాంకరు మూతను సరిచేసేందుకు ట్రాక్టర్‌పైకి ఎక్కాడు. ఈ క్రమంలో విద్యుత్తు తీగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


రోడ్డు ప్రమాదంలో ఒకరు...

తాళ్లరేవు: మండలంలోని 216 జాతీయ రహదారిపై చొల్లంగి వద్ద శనివారం కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఆటో డ్రైవర్‌ దడాల విజయకుమార్‌తోపాటు అయిదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాకినాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో మట్లపాలేనికి చెందిన పినపోతు విశ్వనాథం(55) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కోరంగి ఎస్సై వై. సతీష్‌ తెలిపారు. అమలాపురం నుంచి విశాఖపట్నం వెళ్తున్న కారు ఆటోను తప్పించే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న మరో ఆటోను బలంగా ఢీకొందని ఆయన తెలిపారు. సంఘటనపై కోరంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



అనారోగ్యంతో శిశువు..

రాజవొమ్మంగి: రాజవొమ్మంగి పంచాయతీ శ్రీరామ్‌నగర్‌కు చెందిన నారపురెడ్డి లోవకుమారికి జన్మించిన మూడు నెలల శిశువు అనారోగ్యంతో శనివారం మృతి చెందింది. గురువారం శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడుతున్న శిశువును కుటుంబసభ్యులు విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతిచెందింది.


 

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.