శనివారం, డిసెంబర్ 14, 2019
కామారెడ్డిలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు
కామారెడ్డి అర్బన్, న్యూస్‌టుడే: దిల్లీలో న్యాయవాదులపై పోలీసుల దాడిని ఖండిస్తూ.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో న్యాయవాదులు సోమవారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్‌రావు, సురేందర్‌రెడ్డిల నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. న్యాయవాదులను లాకప్‌లో పెట్టి చితకబాదడం, పోలీసుస్టేషన్‌కు న్యాయమూర్తులు వెళ్లినా విడిచిపెట్టకపోవడం అన్యాయమని వాపోయారు. ఆందోళనలో న్యాయవాదులు శంకర్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, వెంకట్రాంరెడ్డి, రాజు, శ్రీనివాస్, సూర్యప్రసాద్, సిద్ధిరాములు, శివరాజ్‌గౌడ్, శ్రీకాంత్‌గౌడ్, చంద్రశేఖర్, శ్రీనివాస్‌రెడ్డి, రాజ్‌గోపాల్‌గౌడ్, అన్వర్షరీష్, రజనీకాంత్, దేవరాజు, వేణు తదితరులు పాల్గొన్నారు.
బాల్‌రాజ్‌గౌడ్ మృతికి సంతాపం
కామారెడ్డి అర్బన్: ఇటీవల గుండె పోటుతో మరణించిన సామాజిక సేవాతత్పరుడు- సంఘ సేవకుడు చింతల బాల్‌రాజ్‌గౌడ్ మృతికి కామారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సంతాపం తెలిపారు. జిల్లా అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
జిల్లా వార్తలు