close

శనివారం, జనవరి 25, 2020

తాజా వార్తలు

భగవద్గీత అధ్యయనంతో జీవితం సార్థకం

శ్రీ విద్యాశంకర భారతీ తీర్థ స్వామిజీ

10వేల మంది విద్యార్థులతో గీతా పారాయణం

* భక్తి గీతాల ఆలాపన, * గీతా పారాయణం కార్యక్రమంలో తితిదే ఛైౖర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి,

విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సీవీఎస్‌ఓ గోపినాథ్‌జెట్టి, జేఈఓ బసంత్‌కుమార్‌,

ఇస్కాన్‌ ప్రతినిధులు, తితిదే బోర్డు సభ్యులు

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: మానవులు తమ జీవితాన్ని సార్థకం చేసుకునేందుకు భగవద్గీతను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పుష్పగిరి మఠం పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీతీర్థ స్వామిజీ ఉద్ఘాటించారు. ఇస్కాన్‌, తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం తిరుపతిలో గీతా జయంతిని ఘనంగా నిర్వహించారు.

తితిదే విద్యాసంస్థలు, ఇతర ధార్మిక సంస్థలకు చెందిన 10వేల మందికి పైగా విద్యార్థులు సామూహిక గీతా పారాయణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీతను చదివి అర్థం చేసుకుని ఆచరణలో పెడితే ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుందన్నారు. ప్రభుత్వ విప్‌, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ భగవద్గీత బాధ్యతలను గుర్తు చేసి కర్తవ్యాన్ని బోధిస్తుందని చెప్పారు. మానవుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలను గీతలో భగవంతుడు తెలియజేశాడని వివరించారు. తితిదే తిరుపతి జేఈవో పి.బసంత్‌ కుమార్‌ మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతిలోని రామకృష్ణ మఠం కార్యదర్శి శ్రీ అనుపమానందస్వామిజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో అనంతమైన శక్తి ఉంటుందని, దానిని తెలుసుకుంటే జన్మ ధన్యమన్నారు. గీతను పఠిస్తే మానవులకు ఆత్మజ్ఞానం కలుగుతునని తెలిపారు. అనంతరం ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి డాక్టర్‌ ఆకెళ్ల విభీషణశర్మ, ఎస్వీ వేదక్‌ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి రాజగోపాలన్‌, ఇస్కాన్‌ ప్రతినిధులు లీలాపారాయణదాస్‌, తరంగిణి సంస్థ అధ్యక్షులు డాక్టర్‌ నాగేంద్రసాయి, భారతీయ విద్యాభవన్‌ సంచాలకులు సత్యనారాయణరాజు ప్రసంగించారు.

మాట్లాడుతున్న విద్యా శంకర భారతీ తీర్థ స్వామిజీ

గోవిందనామస్మరణ

ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, ధర్మగిరి వేద పాఠశాలకు చెందిన 30 మంది వేద విద్యార్థులు భగవద్గీతలోని 15వ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని 20 శ్లోకాలను పారాయణం చేశారు. వీరిని విద్యార్థులు అనుసరించారు. విశాఖలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థకు చెందిన ఆధ్యాత్మికవేత్త సాయి ప్రసన్న శ్లోకాల వివరణ ఇచ్చారు. అంతకుముందు విద్యార్థులతో గోవిందనామాలను పలికించారు. బ్రహ్మకుమారీస్‌ ప్రతినిధులు ఓంకారం పలికించారు. తితిదే ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థుల సంగీత విభావరి ఆకట్టుకుంది. కార్యక్రమంలో తితిదే బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి, సీవీఎస్‌వో గోపినాథ్‌జెట్టి, తితిదే విద్యాశాఖాధికారి రమణప్రసాద్‌, తితిదే అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి, డిప్యూటీ ఈవో విజయసారథిఫ, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య బి.విశ్వనాథ్‌, శ్వేత సంచాలకులు రామాంజులరెడ్డి, హెచ్‌డీపీపీ ఏఈవో నాగేశ్వరరావు, తితిదే విద్యాసంస్థలకు చెందిన ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


వర్షంలో గొడుగులతో విద్యార్థులు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.