close

బుధవారం, మార్చి 20, 2019

తాజా వార్తలు

మత్స్య కార్మికుల జీవితాల్లో వెలుగులు: పోచారం

బాన్సువాడ, న్యూస్‌టుడే: తెరాస ప్రభుత్వం మత్స్య కార్మికుల లబ్ధిచేకూర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపిందని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం బాన్సువాడలో మత్స్య కార్మికులకు మంజూరైన ఆటోలు, క్రేట్స్‌, వలలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో అత్యధికంగా రాయితీ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని గుర్తుచేశారు. వృత్తిదారులకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నీళ్లు వస్తే ఏడాది మొత్తం చెరువులు నీటితో కళకళలాడుతాయన్నారు. రైతుల పంటలకు ఇబ్బందుల ఉండదని పేర్కొన్నారు. 100 శాతం రాయితీతో చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో 825 మంది లబ్ధిదారులకు ద్విచక్ర వాహనాలు పంపిణీ చేశామన్నారు. స్పీకర్‌గా ఉన్నత పదవిలో ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి తనయుడు, దేశాయిపేట్‌ సహకార సంఘం అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి, రైసస జిల్లా సమన్వయకర్త అంజిరెడ్డి, మత్స్యకార్మిక సహకార సంఘం జిల్లా ఛైర్మన్‌ పల్లికొండ సాయిబాబా, ఎంపీపీ రేష్మాబేగం, జడ్పీటీసీ సభ్యుడు జంగం విజయ, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ నందిని, సహకార సంఘం అధ్యక్షుడు ఎర్వాల కృష్ణారెడ్డి, జడ్పీకోప్షన్‌ సభ్యుడు బాబా, తెరాస మండలాధ్యక్షుడు మోహన్‌నాయక్‌, సురేష్‌, వినయ్‌, ఎజాజ్‌, గంగాధర్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

ప్రధానాంశాలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.