close

ప్ర‌త్యేక క‌థ‌నం

మరణానికి ప్రయాణం!

  గతేడు 20,325 ప్రమాదాల్లో 5,985 మంది మృత్యువాత
 ఈ ఏడాది ఆర్నెల్లలోనే 3795 మంది బలి
  ప్రమాదాలు తగ్గుతున్నా.. మృతుల సంఖ్య పెరగడంపై ఆందోళన
 నియంత్రణ చర్యలపై యంత్రాంగం దృష్టి
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నా వాటి తీవ్రత పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు చేపడుతున్న చర్యలు ప్రమాదాలు తగ్గించేందుకు  ఉపయోగపడుతున్నా..మరణాలు ఎక్కువవుతుండటం వారిని ఆలోచనలో పడేసింది. గత ఏడాది రోడ్డు ప్రమాదాల కారణంగా రోజుకు సరాసరిన 17.91 మంది చనిపోగా, ఈ ఏడాది ఇప్పటివరకు ఆ సంఖ్య 20.91కి పెరగడమే వారి ఆందోళనకు కారణం.
రోడ్డెక్కితే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామో? రామో? తెలియని పరిస్థితి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఇప్పటి వరకు 10,423 ప్రమాదాలు జరగడం, 3795 మంది మరణించడం, 10,980 మంది క్షతగాత్రులవడం పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతోంది. అత్యధికంగా సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 444 మంది చనిపోగా, ములుగు జిల్లాలో మరణాల సంఖ్య 36గా నమోదైంది. గత ఏడాది మొదటి 11 నెలల్లో రాష్ట్రంలో 20,325 ప్రమాదాలు జరగ్గా 5,985 మంది చనిపోయారు. ఆ గణాంకాలను విశ్లేషించిన పోలీసులు ‘‘గత ఏడాది కంటే ఈ సంవత్సరం ప్రమాదాలు తగ్గాయని, మరణాలు మాత్రం పెరిగాయనే’’ నిర్ధారణకు వచ్చారు. కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు.

మరణాలు తగ్గించలేని చర్యలెందుకు?
ప్రమాదాలను నియంత్రించే చర్యల అసలు ఉద్దేశం మరణాల సంఖ్య తగ్గించడమే. రహదారి భద్రత ప్రమాణాలు పాటించడం ద్వారా మొదటి లక్ష్యాన్ని సాధించడంలో ప్రగతి సాధించినప్పటికీ మరణాలు మాత్రం అదుపులోకి రాకపోవడంతో పోలీసు యంత్రాంగం ఆలోచనలో పడింది.  ఇందుకు గల కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించేందుకు సిద్ధమైంది. ‘‘వాహనాల సంఖ్య పెరుగుతుండటం వల్లనే ప్రమాదాలు పెరుగుతున్నాయని తొలుత భావించే వాళ్లం. తర్వాత ప్రమాదాల సంఖ్య పెరగడం వల్లనే మరణాలు ఎక్కువవుతున్నాయనే నిర్ణయానికొచ్చాం. ప్రస్తుత పరిస్థితి రెండింటికీ భిన్నంగా ఉంది. నియంత్రణ ఎలా? అనే అంశంపై వివిధ శాఖల అధికారులతో చర్చిస్తున్నాం. సాధ్యమైనంత వేగంగా ప్రమాద బాధితులకు వైద్య సేవలు అందించడం ద్వారా మరణాల సంఖ్యను నియంత్రించవచ్చనేది ఒక ఆలోచన. దానికేం చేయాలనే అంశంపై త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తాం’’ అని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.