close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గుడ్డు.. భలే మంచి ఫుడ్డు

నేడు ప్రపంచ గుడ్డు దినోత్సవం

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: ప్రపంచంలో పోషకాలు సమృద్ధిగా కలిగి చౌకగా దొరికే ఆహారం.. కోడిగుడ్డు. ఏటా అక్టోబరు రెండో శుక్రవారం ‘ప్రపంచ గుడ్డు దినోత్సవం’గా జరుపుతున్నారు. మన దేశం గుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానం, కోడి మాంసం ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది. త్వరలో అగ్రస్థానానికి చేరుకోగలదని పౌల్ట్రీ రంగ నిపుణులు భావిస్తున్న తరుణంలో కరోనాతో ఈ రంగం కుదేలైపోయింది.
పడిపోయిన గుడ్ల ఉత్పత్తి
కరోనాకు ముందు నిత్యం 26 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరుగుతుండగా ప్రస్తుతం 21 కోట్లకు పడిపోయింది. గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో వదంతులతో పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. నష్టాలపాలైన రైతులు కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. కొంత కాలానికి కరోనాను ఎదుర్కోవాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడానికి కోడిగుడ్లు, కోడి మాంసం తీసుకోవాలన్న ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచనతో పౌల్ట్రీ ఉత్పత్తుల వినియోగం మళ్లీ పెరిగింది. గుడ్ల ధర పెరిగినా.. ఉత్పత్తి వ్యయం భారీగా పెరగడంతో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు.
పరిశ్రమ కోలుకోవాలంటే..
రుణాలపై వడ్డీ రాయితీ, ఏడాదిపాటు మారటోరియం, రాయితీపై మొక్కజొన్నలు అందించడం, గోదాముల్లోని నూకలు, గోధుమలను సరసమైన ధరకు అందించడం వంటి చర్యలు చేపట్టాలి. తద్వారా పరిశ్రమకు కాస్త ఉపశమనం లభిస్తుంది.
వినియోగం ఇలా..
నేషనల్‌ న్యూట్రిషనల్‌ కౌన్సిల్‌ ఏటా 180 గుడ్లు తినాలని సిఫార్సు చేయగా దేశంలో తలసరి వినియోగం 73గా ఉంది. మెట్రో నగరాల్లో తలసరి వినియోగం 100 గుడ్లు. ఉత్తరాది కంటే దక్షిణాదిలో వినియోగం ఎక్కువగా ఉండగా.. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడులో 100-110 వరకు వినియోగిస్తున్నారు.


నిరుద్యోగ సమస్యకు పరిష్కారం

పౌల్ట్రీ పరిశ్రమ గ్రామీణ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంతో పాటు ఆహార భద్రతకు దోహదపడుతోంది. మొక్కజొన్న, సోయా పంటలకు గిట్టుబాటు ధర కల్పనకు సహకరిస్తోంది. రవాణా రంగం కూడా పౌల్ట్రీపై ఆధారపడి ఉంది. కరోనాతో పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమ, రైతులకు ప్రోత్సాహం అందించాలి. ఇప్పుడున్న పరిస్థితులు కొనసాగితే పరిశ్రమ విస్తరణ తగ్గిపోయి ఉత్పత్తి తరుగుదలతో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల తరహాలో గుడ్డు ధర రూ.11కి పెరుగుతుంది. అప్పుడది అందుబాటులో లేక ప్రజల్లో పోషక విలువలు పడిపోయి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. గుడ్డు.. పేదవాడి ఆహారం. ఇది అందరికీ అందాలని నా ఆకాంక్ష.

- డాక్టర్‌ వి.సుందరనాయుడు, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ కోళ్ల పరిశ్రమ సమాఖ్య


అత్యధిక ప్రొటీన్లు

కూరగాయల కంటే ఎక్కువ ప్రొటీన్లు కలిగి ఉండి, జీర్ణశక్తి పెంచడంలో గుడ్లు దోహదపడుతున్నాయి. పోషణకు గుడ్డు నిజమైన విలువను ప్రజలు ఇంకా పూర్తిగా అవగాహన చేసుకోవట్లేదు. తల్లి పాల తర్వాత గుడ్డును ఉత్తమమైన ఆహారంగా గుర్తించారు.

- సురేష్‌ చిట్టూరి, ఛైర్మన్‌, అంతర్జాతీయ గుడ్ల కమిషన్‌


తలసరి వినియోగం 220కి చేరుకోవాలి

ప్రపంచ ఆరోగ్యసంస్థ ఏటా 180 గుడ్లు తినాలని సిఫార్సు చేసింది. ఈ సంఖ్య 220కి చేరుకుంటే ప్రజల్లో పోషక విలువలు పెరగడంతో పాటు పౌల్ట్రీ పరిశ్రమ నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. కరోనాతో పరిశ్రమ ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు విస్తరణ ఆగిపోయింది. ప్రభుత్వాలు చర్యలు చేపడితే తప్ప పరిశ్రమ, రైతులు కోలుకునే పరిస్థితి లేదు.

- వి.రమేష్‌బాబు, ఛైర్మన్‌, నెక్‌ చిత్తూరు జోనల్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.