close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పారిశ్రామిక భద్రతేదీ?

  రాష్ట్రంలో వరుసగా ప్రమాదాలు
  పట్టని పలు యాజమాన్యాలు

ఈనాడు, అమరావతి: ఎల్‌జీ పాలిమర్స్‌... ఎస్పీవై ఆగ్రో.. సాయినార్‌ లైఫ్‌ సైన్సెస్‌.. తాజాగా విశాఖ సాల్వెంట్స్‌.. ఇలా రాష్ట్రంలోని పలు పరిశ్రమల్లో చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పారిశ్రామిక రక్షణ చర్యలు, ప్రమాణాలను పాటించడంలో లోపాలను ఎత్తి చూపుతున్నాయి. నియంత్రణ సంస్థలూ చురుకుగా వ్యవహరించడంలేదు. ఈ ఉదాసీనతే ప్రమాదాలకు కారణమై ఏటా పదుల ప్రాణాల్ని బలి తీసుకుంటోంది.
కనిపించని భద్రత అధికారులు
రక్షణ చర్యలను నిత్యం పరిశీలించి, లోపాలను సరిదిద్దేందుకు ప్రతి పరిశ్రమలో భద్రత (సేఫ్టీ)  అధికారులు ఉండాలి. వీరి ఆధ్వర్యంలోనే కార్మికులకు, సిబ్బందికి రక్షణ చర్యలపై శిక్షణనివ్వాలి. ఇలాంటి కీలక అధికారులు చాలా పరిశ్రమల్లో   కనిపించడం లేదు. ఫలితంగా ప్రమాదాలతోపాటు నష్ట తీవ్రత పెరుగుతోంది.
* కర్మాగారాల చట్టం-1948 ప్రకారం వెయ్యి మందికి పైగా సిబ్బంది పని చేసే పరిశ్రమల్లో తప్పని సరిగా భద్రత అధికారులను నియమించాలి. అంతకంటే తక్కువ మందే ఉన్నా... ప్రమాదానికి ఆస్కారమున్న పరిశ్రమలైతే అక్కడా సేఫ్టీ అధికారులు తప్పనిసరి. ఈ ప్రక్రియలేవీ సరిగ్గా అమలవట్లేదు. చాలా సంస్థలు ఇదంతా అనవసరపు ఖర్చుగా భావిస్తున్నాయి. దీంతో చిన్నచిన్న   లోపాలనూ గుర్తించలేక.. అవే చివరకు పెద్ద ప్రమాదాలకు దారితీస్తున్నాయి.
నామమాత్రంగానే భద్రత ఆడిట్‌
ప్రతి కర్మాగారం ఏడాదికోసారి భద్రత ఆడిట్‌ నిర్వహించాలి. గుర్తించిన లోపాలను సరి చేసుకుంటే చాలావరకు ప్రమాదాలను నియంత్రించొచ్చు. చాలా సంస్థలు ఆడిట్‌ ఊసే ఎత్తవు. ఒకవేళ చేయించినా, లోపాలను సరి చేయవు. ప్రస్తుతానికి నడుస్తున్నాయి కదా... అనే ఉదాసీనత ప్రమాదాలకు దారితీస్తోంది.
* కర్మాగారాల విభాగం ఎప్పటికప్పుడు పరిశీలించి లోపాలను సరి చేయించాలి. అయితే కొన్ని సందర్భాల్లో పూర్తి స్థాయి తనిఖీలు చేయకుండానే ధ్రువపత్రాలను జారీ చేస్తోందన్న ఆరోపణలూ ఉన్నాయి.
* ఏదైనా ప్రమాదం చోటుచేసుకుని ప్రాణ నష్టం సంభవిస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉండట్లేదు. దీంతో ఏం జరిగినా తమకేం కాదులే అన్న ధోరణి వారిలో కనిపిస్తోంది.


తాజా కమిటీ సిఫార్సుల అమలుతోనే మేలు

ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటనపై విచారణ జరిపిన ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పారిశ్రామిక భద్రతకు సంబంధించి పలు కీలక సిఫార్సులు చేసింది. వాటిని వెంటనే అమలు చేయాల్సిన అవసరముంది.
* ఏటా భద్రత, పర్యావరణ ఆడిట్‌లు తప్పనిసరిగా నిర్వహించాలి. వాటిలో గుర్తించిన లోపాలను నిర్దేశిత కాల వ్యవధిలో సరి చేయాలి.
* ప్రమాదకర రసాయనాలను నిర్వహించే ప్రతి పరిశ్రమకు నిర్ణీత సాంకేతిక అర్హతలు, అనుభవం కలిగిన వ్యక్తి సీనియర్‌ సేఫ్టీ అధికారిగా ఉండాలి. ప్రతి షిఫ్టులోనూ ఆయన అందుబాటులో ఉండాలి.
* రసాయన పరిశ్రమలున్న ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాల సిబ్బందికి ప్రతి మూడేళ్లకోసారి సేఫ్టీ కోర్సుపై శిక్షణ ఇప్పించాలి.
* అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలా ప్రతి కంపెనీ సంసిద్ధంగా ఉండాలి.
* ప్రమాదకర రసాయన పరిశ్రమలను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాలి.
* ప్రమాదం జరిగిన వెంటనే ఆ సమాచారం సమీప పోలీసుస్టేషన్‌కు, అగ్నిమాపక కేంద్రానికి, కలెక్టరేట్‌లోని ఎస్‌డీఆర్‌ఎఫ్‌ విభాగానికి, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌కు, పీసీబీ ప్రాంతీయ కార్యాలయానికి తెలిసేలా కర్మాగారాల్లోనే సెన్సార్లు ఏర్పాటు చేయాలి.
* కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఫ్యాక్టరీ సేఫ్టీ బోర్డులు ఏర్పాటు చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.