close
Updated : 17/07/2021 05:27 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

‘దీక్ష’గా కొత్త పంథా

కరోనా ప్రభావంతో బయటి తిండి తినడానికి భయపడుతున్న వారెందరో! దాంతో కొత్త వంటకాలను ఇంట్లోనే ప్రయత్నిస్తున్నారు. ఎంతో కష్టపడి చేసినా రెస్టారెంట్‌ రుచి రాలేదంటూ మూతి విరుపులు. పోనీ ఇన్‌స్టంట్‌వి ప్రయత్నిద్దామంటే నిల్వ ఉండటానికి ఏం రసాయనాలు కలిపారో అన్న అనుమానం. ఇవన్నీ చూసిన ఓ అమ్మాయికి ఒక ఉపాయం తట్టింది. దాన్నే వ్యాపార మార్గంగానూ మలుచుకుంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఏమా వ్యాపారం?

దీక్ష.. దేన్నైనా కొత్తగా ప్రయత్నించాలనుకునే మనస్తత్వమున్న అమ్మాయి. ఈమెకి వంట చేయడమంటే ఆసక్తి. లాక్‌డౌన్‌లో సమయాన్ని దీనికి వినియోగించుకుని ఎన్నో కొత్త వంటకాలపై పట్టు సాధించింది. అప్పుడే దాన్ని వ్యాపారంగా చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. ఇంతకీ అదేంటో తెలుసా? పలు దేశీ, విదేశీ వంటకాలను అందించడం! దీనిలో కొత్తేముంది? అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే తను అందించేది డీఐవై మీల్‌ కిట్స్‌. అంటే.. ఒక వంటకానికి సంబంధించిన కూరగాయల దగ్గర్నుంచి మసాలాలు, ఉప్పు, కారం ఎంత మొత్తంలో అవసరమవుతాయో వాటన్నింటినీ ఒక బాక్స్‌లో సర్ది అందిస్తుంది. వాటితో పాటు తయారీ విధానంతో కూడిన పేపర్‌నూ ఉంచుతుంది. కొనుకున్న వాళ్లు దాని ప్రకారం వండేసుకుంటే సరిపోతుంది.
దీక్ష పిరోగివల్‌ది కోల్‌కతా. వోగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ నుంచి పీజీ చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ మంది కొత్తవాటిని ప్రయత్నించడం, కొందరు ఏం చేయాలో తోచట్లేదంటూ మెసేజ్‌లు పెట్టడం గమనించింది. అలా ఈ డీఐవై విధానానికి శ్రీకారం చుట్టింది. కొంత పరిశోధన చేసి ఇంట్లో వాటిని ఉపయోగించే వ్యాపారం ప్రారంభించింది. కొన్ని అధునాతన సామగ్రిని మాత్రం అమర్చుకుంది. ఇన్‌స్టా వేదికగా ‘యువర్‌ డీఐవై కిచెన్‌’ పేరిట వ్యాపారం కొనసాగిస్తోంది. భారతీయ వంటకాలే కాకుండా చైనీస్‌, థాయ్‌, కొరియన్‌ వంటకాలకు సంబంధించినవి అందిస్తోంది. తయారీ చదువుకుని చేయడం ఇబ్బంది అనుకునే వారి కోసం ఇన్‌స్టాలో వీడియోలనూ ఉంచుతోంది. ప్రస్తుతం ఆదరణ పెరుగుతుండటంతో వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాలకూ విస్తరించే ఆలోచనలో ఉంది.

‘లాక్‌డౌన్‌లో ఇంటి వంటకు ప్రాధాన్యం పెరిగింది. భార్యాభర్తలిద్దరూ పనిచేసేవారే అయితే చేసుకునే ఓపిక ఉండదు. అలాంటిది పది నిమిషాల్లో నోరూరే వంటలు సిద్ధం చేసుకునే అవకాశముంటే ఉపయోగించుకుంటారు కదా! ఇంకా ఇది జిహ్వచాపల్యాన్ని తీర్చడంతోపాటు ఇంట్లో చేసినవే తిన్నామన్న సంతృప్తినీ ఇస్తుంది. పైగా సులువుగా చేసుకోవచ్చు. ఆదరణ ఉంటుందనిపించింది. అందుకే దీన్ని ఎంచుకున్నా. పైగా వీటిలో ప్రిజర్వేటివ్‌లేమీ ఉపయోగించం. తాజావాటికే ప్రాధాన్యమిస్తున్నాం. ఎక్కువగా పిల్లలు, ఇంట్లోనే కొద్దిమందితో పార్టీలు చేసుకునేవారి నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. అందుకే పిల్లలకు నచ్చినట్టుగా అక్షరాల్లో, వివిధ ఆకారాల్లో పిజ్జా వంటివీ అందిస్తున్నాం. దేశంతోపాటు విదేశీ వంటకాలనూ అందిస్తున్నాం’ అంటోంది దీక్ష. పాత ఆలోచనే కానీ విధానంలో బాగా ఉపయోగించుకుంటోంది కదూ!

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని