close
Published : 04/04/2021 02:49 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

తరచూ ఇలా చేస్తున్నారా...

అందం, అలంకరణ పేరుతో మనం చేసే కొన్ని పొరపాట్లు చర్మాన్ని పాడు చేస్తాయి. వాటికారణంగా చర్మానికి ఎదురయ్యే సమస్యలు ఏంటో చూద్దాం!
ఎక్కువసార్లు ముఖం కడిగితే
చాలామంది చేసే పొరపాటు  రోజులో నాలుగైదుసార్లైనా ముఖం కడిగేయడం. ఇలా చేస్తే ముఖంలో మురికిపోయి తాజాగా కనిపిస్తారని భ్రమపడతారు. కానీ తరచూ ముఖం కడగడం వల్ల  పొడారిపోతుంది.  మృతకణాలు ఒక  పొరగా ఏర్పడి వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. అలాగే సబ్బుతో తరచుగా ముఖం కడిగే వారిలో సెబాషియస్‌ గ్రంథి ఎక్కువగా పనిచేసి ముఖాన్ని జిడ్డుగా మారుస్తుంది .  
క్లెన్సర్లు అదేపనిగా
మురికిని తొలగించుకోవాలన్న అభిప్రాయంతో శక్తివంతŸమైన అంటే గాఢత ఎక్కువగా ఉన్న రసాయనాలతో కూడిన క్లెన్సర్‌ని కొందరు అదేపనిగా వాడేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు.  అతిగా క్లెన్సర్లని వాడటం వల్ల దీనిలోని బెంజైల్‌ పెరాక్సైడ్‌ చర్మాన్ని ఇరిటేషన్‌కి గురి చేస్తుంది. దాంతో చర్మం ఎర్రగా కమిలిపోయే ప్రమాదం ఉంది.
ఒకేసారి ఎక్కువ ఉత్పత్తులు
మనకిష్టమైన బ్రాండ్‌ నుంచి కొత్త ఉత్పత్తి వచ్చిందని తెలియగానే దాన్ని వాడేయాలని తహతహలాడతాం. కానీ అంత వేగంగా చర్మం తన పీహెచ్‌ స్థాయిలని మార్చుకోవడం సాధ్యపడదు. ఒకేసారి ఎక్కువ ఉత్పత్తులని వాడటం లేదా వెంటవెంటనే ఉత్పత్తులని మార్చడం  మంచి పద్ధతులు కాదు. షాంపూలతో  చర్మంపై అలర్జీలు దాడిచేసినప్పుడు మనం ముందుగా అనుమానించేది ఆహారాన్నే. ఉదయం నుంచి ఏం తిన్నామా  అని ఆలోచిస్తాం. కానీ ఇలాంటి వాటి వెనుక షాంపూలూ, కండీషనర్ల ప్రభావం కూడా ఉంటుందని తెలుసుకోండి. ఈసారి అలర్జీ వస్తే షాంపూని కూడా అనుమానించాల్సిందే. ముఖం, భుజాలూ, మెడ వెనుక భాగంలో వచ్చే అలర్జీలకు షాంపూలు కూడా కారణమయ్యే అవకాశం ఉంది. తస్మాత్‌ జాగ్రత్త.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని