close

ఆంధ్రప్రదేశ్‌-లోక్‌సభా స్థానాలు

అరకు లోక్‌సభ నియోజకవర్గం 

అరకు పార్లమెంటరీ నియోజకవర్గం 2009లో కొత్తగా ఏర్పాటయ్యింది. గతంలో పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలు, భద్రాచలం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పాడేరు, అరకు, నియోజకవర్గాలు, తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం శాసనసభ నియోజకవర్గం కలిపి అరకు లోక్‌సభ నియోజకవర్గం ఏర్పాటైంది. నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఏకైక నియోజకవర్గం ఇది. 
రిజర్వేషన్ : ఎస్టీ 
శాసనసభా నియోజకవర్గాలు : విజయనగరం జిల్లాలో పార్వతీపురం.,కురుపాం, సాలూరు, నియోజవర్గాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ, విశాఖ జిల్లాలో పాడేరు, అరకు నియోజకవర్గాలు, తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం శాసనసభా నియోజకవర్గం ఉన్నాయి.
ప్రస్తుతం ఈ లోక్‌సభ నియోజకవర్గ నుంచి తెదేపా తరపున వైరిచర్ల కిషోర్‌ చంద్రదేవ్‌ పోటీ చేస్తుండగా, వైకాపా నుంచి  జి.మాధవి, కాంగ్రెస్‌ నుంచి శ్రుతీదేవిలు బరిలో ఉన్నారు.

1952 నుంచి 2009 వరకు విజేతలు వీరే 
పార్వతీపురం పార్లమెంటు నియోజకవర్గంగా ఉన్నప్పుడు గెలుపొందిన అభ్యర్థులు
1952 : ఎన్.రామశేషయ్య - స్వతంత్ర అభ్యర్థి 
1957 : డిప్పల సూరి దొర - సోషలిస్టు పార్టీ 
1962 : బిడ్డిక సత్యనారాయణ - (కాంగ్రెస్‌)
1967 : వి.నరసింహ దొర - స్వతంత్ర పార్టీ 
1971 : బిడ్డిక సత్యనారాయణ - (కాంగ్రెస్‌)
1977 : వైరిచర్ల కిశోర్‌చంద్ర సూర్యనారాయణదేవ్ - (కాంగ్రెస్‌)
1980 : వైరిచర్ల కిశోర్‌చంద్ర సూర్యనారాయణదేవ్ - (కాంగ్రెస్‌)
1984 : వైరిచర్ల కిశోర్‌చంద్ర సూర్యనారాయణదేవ్ - (కాంగ్రెస్‌)
1989 : శత్రుచర్ల విజయరామరాజు - (కాంగ్రెస్‌)
1991 : శత్రుచర్ల విజయరామరాజు - (కాంగ్రెస్‌)
1996 : వైరిచర్ల ప్రదీప్‌కుమార్ దేవ్ - (కాంగ్రెస్‌)
1998 : శత్రుచర్ల విజయరామరాజు - తెలుగుదేశం
1999 : డి.వి.జి. శంకరరావు - తెలుగుదేశం
2004 : వైరిచర్ల కిశోర్‌చంద్ర సూర్యనారాయణదేవ్ :(కాంగ్రెస్‌)

* అరకు లోక్‌సభ నియోజకవర్గంగా మారాక: 
* 2009 : వైరిచర్ల కిశోర్‌చంద్ర సూర్యనారాయణ దేవ్ - (కాంగ్రెస్‌)
* 2014: కొత్తపల్లి గీత(వైకాపా)



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net