close

తెలంగాణ లోక్‌సభా స్థానాలు

జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం 

2008లో జరిగిన పునర్విభజనతో మెదక్ జిల్లాలో జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది. గతంలో ఇది మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండేది. 
రిజర్వేషన్ : జనరల్ 
అసెంబ్లీ నియోజకవర్గాలు: జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోకి ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్‌తో పాటు, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్, బాన్స్‌వాడ అసెంబ్లీ నియోజకవర్గాలను చేర్చారు.

తాజా ఎన్నికల్లో జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ బీబీ పాటిల్‌ మరోసారి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కె.మదన్‌ మోహనరావుకు అవకాశం కల్పించగా, భాజపా నుంచి బాణాల లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. 

* 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సురేష్‌శెట్కార్‌ ఎంపీగా ఎన్నికయ్యారు. 
* 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన సురేష్‌శెట్కార్‌పై తెరాస అభ్యర్థి బీబీ పాటిల్‌ 1,42,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net