close

తాజా వార్తలు

ట్విటర్‌, ఎఫ్‌బీ ప్రొఫైల్‌ ఫొటోలను మార్చిన టీఎంసీ నాయకులు


కోల్‌కతా: టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ, ఆ పార్టీ సీనియర్‌ నాయకులు బుధవారం వారి ఫేస్‌బుక్‌(ఎఫ్‌బీ), ట్విటర్‌ ఖాతాల ప్రొఫైల్‌ ఫొటోలను మార్చుకున్నారు. ఇంతకుముందు ఉన్న ఫొటోల స్థానంలో సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ చిత్రాన్ని ఉంచారు. మంగళవారం భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఎన్నికల ర్యాలీ సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో విద్యాసాగర్‌ విగ్రహం ధ్వంసమైన సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ టీఎంసీ నాయకులు  వీటిని మార్చుకొని నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ అధికారిక ఫేస్‌బుక్, ట్విటర్ ఖాతాల ప్రొఫైల్‌ స్థానంలో చిత్రాల స్థానంలో విద్యాసాగర్ చిత్రాన్ని ఉంచారు. ఈ ఘటనపై మమత బుధవారం నిరసన ర్యాలీని చేపట్టనున్నారు. విద్యాసాగర్ ప్రముఖ సంఘ సంస్కర్త. అలాగే బెంగాల్ పునరుజ్జీవనంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. 
ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్‌ షా మంగళవారం రోడ్ షో నిర్వహిస్తోన్న సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆయన రోడ్ షోకు వ్యతిరేకంగా టీఎంసీ, సీపీఎం కార్యకర్తలు నిరసనకు దిగారు. షా కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. దీంతో రెచ్చిపోయిన భాజపా కార్యకర్తలు పలు వాహనాలకు నిప్పు పెట్టడంతో పాటు సంఘ సంస్కర్త విద్యాసాగర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net