close

తాజా వార్తలు

కాంగ్రెస్‌ వ్యూహంలో భాగమే ఆ ఇద్దరూ.. మోదీ

దేవ్‌ఘర్‌ (ఝార్ఖండ్‌): మోదీని తట్టుకుని నిలబడలేమని, గెలవలేమని తెలుసుకున్న కాంగ్రెస్‌ ఇద్దరు బ్యాట్స్‌మెన్లను సిద్ధం చేసుకుందని ప్రధాని మోదీ అన్నారు. బుధవారం ఝార్ఖండ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ఓడిపోయిన తర్వాత వీరి వ్యాఖ్యల వల్లే ఓడిపోయామని చెప్పుకొనేందుకే శామ్‌ పిట్రోడా, మణి శంకర్‌ అయ్యర్‌లతో ఇలా విమర్శలు చేయిస్తున్నారని అన్నారు. వీరిలో ఒకర్ని దేనిగురించి అడిగినా ‘జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడేంట’ని పశ్నిస్తున్నారని, మరొకరు ప్రధానిని ‘నీచ్‌ ఆద్మీ’ అని తర్వాత కొంత కాలం కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోతారని అన్నారు. 55 ఏళ్లు అధికారంలో ఉన్న మీ పార్టీ చేసిందేమీ లేకపోగా, 55 నెలల్లో తాము చేసిన అభివృద్ధి దేశ ప్రజలకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని అన్నారు. 

అయితే శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికే ఖండించి, బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరారు. తను చేసిన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించారని అయ్యర్‌ ఒక పత్రికకు రాసిన వ్యాసంలో వివరణ ఇచ్చారు.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net