లెదర్ జాకెట్స్
90ల కాలంలో లెదర్ జాకెట్స్‌ని ఎక్కువగా చూసేవాళ్లం.. అప్పటి సినిమాల్లో హీరో రాజ్‌దూత్ బైక్‌పై లెదర్ జాకెట్ ధరించి వెళ్తుంటే అదో రాయల్ లుక్. దాన్నే నేటి యువత ఫాలో అవుతున్నారు. మార్కెట్లోకి వచ్చిన బైక్‌లపై లెదర్ జాకెట్స్‌ని ధరించి మ్యాన్లీగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. |
ఫ్లన్నెల్ ప్యాటన్
ప్రస్తుతం యువతని మాయలో పడేస్తున్న ట్రెండ్స్‌లో గళ్ల చొక్కాలు ఒకటి. ప్లేన్ షర్ట్స్, పూల చొక్కాలు, కాలర్‌లెస్ షర్టులతో ఇవి పోటీ పడుతున్నాయ్. సింపుల్ కాటన్ జీన్స్‌పై గళ్ల చొక్కలు ధరిస్తే ఆ లుక్కేవేరు అంటున్నారు. |
ట్రాక్ సూట్
ఒకప్పుడు ట్రాక్ పాంట్లపై ఆసక్తి చూపేవారు కాదు. కానీ ఇప్పుడు వాటిపై స్పోర్ట్ షూస్ వేసుకుని మళ్లీ ఫాలో అవుతున్నారు. ఇదే ఎక్కువగా యువత మనసుదోచుకుంటోంది. |
డబుల్ డెనిమ్
అప్పటి డబుల్ షర్ట్ ట్రెండ్ మళ్లీ వస్తోంది. ఈ ట్రెండ్ యువతకి విపరీతంగా నచ్చేసింది. డెనిమ్ షర్ట్ లేదా డెనిమ్ జాకెట్‌తో టాన్ జీన్స్‌కి నేటి యువత ఆసక్తి చూపుతున్నారు. |
ఓవర్ సైజ్డ్ ఫిట్స్
పాత సినిమాల్లో పొడగాటి చొక్కాతో, సింపుల్ జీన్స్‌తో అదరగొట్టేవారు. మళ్లీ అలాంటి ట్రెండునే అనుకరిస్తున్నారు. కేవలం చొక్కాలకే కాకుండా పొడగాటి టీ షర్ట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. |
రౌండ్ కళ్లజోడు
అప్పట్లో రౌండ్ కళ్లజోళ్లు తెగ హల్చల్ చేశాయి. అప్పటి సినిమాల్లో హీరో సూపర్ స్టార్ రజనీ వీటిని ఉపయోగించేవారు. ఇప్పుడూ అవే కళ్లజోళ్లు ట్రెండింగ్ అవుతున్నాయి. |
రాపిడ్ జీన్స్
ఒకప్పుడు మోకాళ్లవద్ద సగం చిరిగిన ప్యాంట్లు, లూజ్ జాకెట్లు, క్యాజువల్ షూస్ ఫ్యాషన్ ప్రపంచంలో రారాజుగా వెలిగింది. తిరిగి అదే ఫ్యాషన్ నేటి టీన్స్‌కి చేరువయ్యింది. |
రౌండ్ హ్యాట్స్
రౌండ్ హ్యాట్స్కి అప్పటి ఆదరణే వేరు. క్రికెట్లో ఆటగాళ్ల నుంచి కాలేజీ విద్యార్థుల వరకూ ప్రతిఒక్కరికీ ఈ హ్యాట్స్పై మక్కువగా ఉండేది. మళ్లీ ఆ ట్రెండ్ వచ్చింది. ఈతరం తమ సామాజిక మాధ్యమాల్లోని ఫొటోల్లో ఈ ట్రెండ్‌తో దర్శనమిస్తున్నారు. |
హెయిర్ స్టైల్
హెయిర్ స్టైల్లోనూ ఒకప్పటి ట్రెండ్‌కే మక్కువ చూపిస్తున్నారు. లాంగ్ కర్లీ హెయిర్ చిన్న పాటి గడ్డంతో ఉండే లుక్‌కి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. |
కమ్‌బ్యాట్ బూట్స్
ఇవి తొంభైల నాటివే. ఇప్పటి యువత మళ్లీ దాన్ని అడాప్ట్ చేసుకుంటోంది. కానీ ఈ బూట్స్ని కేవలం పార్టీవేర్స్కి మాత్రమే పరిమితమయ్యేలా చూస్తున్నారు. |