అయిదేళ్ల బాలుడు.. ఓ మఠానికి పీఠాధిపతి!

తాజా వార్తలు

Published : 15/07/2021 01:29 IST

అయిదేళ్ల బాలుడు.. ఓ మఠానికి పీఠాధిపతి!

బెంగళూరు: కర్ణాటకలోని కలబురిగిలో ఓ ఐదేళ్ల బాలుడు పీఠాధిపతిగా నియమితుడై అందరి దృష్టినీ ఆకర్షించాడు. హిరేమత్ సంస్థానానికి చెందిన పీఠాధిపతి శివబసవ శివాచార్య సోమవారం గుండెపోటుతో మరణించారు. ఆ స్థానంలో అతడి సోదరుడి కుమారుడైన ఐదేళ్ల నీలకంఠను కలుగా మఠానికి నూతన పీఠాధిపతిగా నియమించారు. మంగళవారం వేద పండితుల సమక్షంలో నియామక ప్రక్రియను ఘనంగా జరిపారు. పీఠాధిపతి స్థానం ఖాళీగా ఉండకూడని పక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పండితులు తెలిపారు. ఐదేళ్ల బాలుడు పీఠాధిపతి కావడం చరిత్రలో ఇదే మొదటి సారి అని పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని