ప్రభుత్వం నుంచి నిధులు రావట్లేదు: నిమ్మగడ్డ

తాజా వార్తలు

Published : 22/10/2020 01:14 IST

ప్రభుత్వం నుంచి నిధులు రావట్లేదు: నిమ్మగడ్డ

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సంఘం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎస్‌ఈసీ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్నామని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఏదైనా అవసరం ఉంటే ఎస్‌ఈసీ తమను సంప్రదించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది సూచించగా.. తాము గమనిస్తే తప్పేంటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ వైఖరితో ఎస్‌ఈసీ హైకోర్టును ఆశ్రయించాల్సి రావడం బాధాకరమని ఈ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చెబుతున్న ఇబ్బందులపై సవివరమైన అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎస్‌ఈసీ తరఫున సీతారామమూర్తి, అశ్వినీకుమార్‌ వాదనలు వినిపించారు. మరోవైపు ఈ వ్యవహారంలో నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రూ.39లక్షల నిధులు విడుదల చేయడం గమనార్హం.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని