యుద్ధప్రాతిపదికన పోలవరం పనులు: జగన్‌

తాజా వార్తలు

Published : 15/12/2020 02:20 IST

యుద్ధప్రాతిపదికన పోలవరం పనులు: జగన్‌

ప్రాజెక్టు పరిశీలన అనంతరం అధికారులతో సీఎం సమీక్ష

పోలవరం: ప్రాధాన్యతాక్రమంలో పోలవరం పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టును విహంగవీక్షణం ద్వారా పరిశీలించిన అనంతరం ఇంజినీర్లు, అధికారులు, గుత్తేదార్లతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పునరావాస కార్యక్రమాలకు కనీసం రూ.3,330 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 2022 ఖరీఫ్‌ నాటికి సాగునీరు ఇవ్వాలన్నారు. వచ్చే జూన్‌ 15 నాటికి మళ్లీ గోదావరిలో నీళ్లు వస్తాయని.. ఆలోపే యుద్ధప్రాతిపదికన పనులను పూర్తిచేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. మే నెలాఖరుకు స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ పనులు సంపూర్ణంగా పూర్తికావాలన్నారు. పనులన్నీ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని జగన్‌ సూచించారు. 

ఎత్తు మిల్లీమీటరు కూడా తగ్గించం

పోలవరం డ్యామ్‌ ఎత్తు మిల్లీమీటరు కూడా తగ్గించడం లేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. డ్యామ్‌ నిర్మాణంతో పాటు పునరావాస కార్యక్రమాలు కీలకమన్నారు. వచ్చే మే నెలాఖరు నాటికి పునరావాస కాలనీలు పూర్తి చేసి నిర్వాసితుల తరలింపునకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం జగన్‌ ఆదేశించారు. డెల్టాకు సాగు, తాగునీటి కొరత రాకుండా చూడాలన్నారు. ప్రత్యామ్నాయాలపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని.. దాన్ని ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని చెప్పారు. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. 

సీఎం జగన్‌ పోలవరం పర్యటన సందర్భంగా నిర్వాసితులు ఆయన్ను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు సీఎంకు వినతిపత్రం అందజేశారు. సమస్యలు పరిష్కరిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రాజెక్టు సంబంధించిన చిత్రప్రదర్శనను సీఎం పరిశీలించారు. అధికారులతో సమీక్ష అనంతరం జగన్‌ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి బయల్దేరి వెళ్లారు. సీఎం పోలవరం పర్యటన సందర్భంగా డ్రోన్‌ ద్వారా ఆ ప్రాంతాన్ని చిత్రీకరించారు. 

ఇవీ చదవండి..

అమరావతిలోనే రాజధాని: సోమువీర్రాజు

టీచర్ల బదిలీల్లో రాజకీయం సిగ్గుచేటు: అచ్చెన్నAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని