చలికాలం... హృద్రోగులూ జరభద్రం!

తాజా వార్తలు

Published : 15/12/2020 01:40 IST

చలికాలం... హృద్రోగులూ జరభద్రం!ఇంటర్నెట్‌ డెస్క్‌: చల్లని వాతావరణం ఆస్తమాతో బాధపడేవారికేనా.. హృద్రోగులకూ ఇబ్బందులు కలిగిస్తుంది. ఉష్ణోగ్రతలు అమాంతం తగ్గిపోవటం, శీతల వాతావరణం మూలంగా శరీరంలోని రక్తనాళాలు కుచించుకుపోతుంటాయి. ఇలాంటి పరిస్థితిలో గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో చలికాలంలో హృద్రోగుల జీవన సరళి ఎలా ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?ఆ వివరాలు మీరూ తెలుసుకోండి...

చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గటం వల్ల హృద్రోగులకు అనేక సమస్యలు తలెత్తుతాయి. తీవ్రమైన చలి నుంచి శరీరాన్ని కాపాడేందుకు, దేహంలో ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచేందుకు రక్తనాళాలు సన్నగా కుచించుకుపోతాయి. దీంతో గుండె నుంచి రక్తనాళాల్లోకి అధిక రక్తం ప్రవహిస్తుంటుంది. అలాంటి సమయంలో రక్తపోటు బాగా పెరుగుతుంది. అంతేకాదు చలికాలంలో తగినంత సూర్యరశ్మి లభించకపోవటంతో శరీరానికి విటమిన్‌ డి  కొరత పెరుగుతుంది. దానివల్ల కొలెస్ట్రాల్‌ శాతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితుల వల్ల చలికాలంలో హృద్రోగులకు గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ ముప్పును తప్పించుకుని గుండెను భద్రంగా ఉంచుకునేందుకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు చలిలో బయట తిరగటాన్ని తగ్గించాలి. తప్పని సరిగా వెళ్లాల్సి వచ్చినపుడు మొత్తం శరీరాన్ని కప్పి ఉంచే విధంగా ఉన్ని దుస్తులు ధరించాలి. రక్తపోటు మందులను ఎట్టిపరిస్థితులలోనూ మానకూడదు. మందులను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో కాసేపైనా ఎండకు కూర్చోవాలి. సూర్యుడు ఉదయించిన తరువాతే వాకింగ్‌కు వెళ్లటం మంచిది. ఛాతీలో నొప్పిగా అనిపించినా, ఆయాసం వస్తున్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని