TS: రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ బుక్‌ చేసుకోండిలా!

తాజా వార్తలు

Published : 13/12/2020 01:54 IST

TS: రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ బుక్‌ చేసుకోండిలా!

హైదరాబాద్‌ : తెలంగాణలో మూడునెలల తరువాత వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. హైకోర్టు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్‌ల బుకింగ్‌ను తప్పనిసరి చేసింది. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు జరగనుండగా అందుకోసం స్లాట్‌ల బుకింగ్‌ కొనసాగుతోంది. సంబంధిత శాఖ వెబ్‌సైట్‌ ద్వారా స్లాట్‌లను పొందవచ్చు. పౌరులకు, బిల్డర్‌లకు విడిగా లాగిన్ సదుపాయం కల్పించారు. స్లాట్‌ల బుకింగ్‌తో పాటు ఇతర సేవలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

స్లాట్‌ బుకింగ్‌ ఇలా...
రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్ https://registration.telangana.gov.in/ ద్వారా స్లాట్‌లను ఆన్‌లైన్‌లో పొందవచ్చు. వెబ్‌సైట్‌లో బుక్‌ యువర్‌స్లాట్‌ను క్లిక్‌ చేసి మొబైల్ నంబర్‌ నమోదు చేయటం ద్వారా ఆ సదుపాయాన్ని పొందవచ్చు. ముందుగా పోర్టల్‌లో మొబైల్‌ నంబర్‌ రిజిస్టర్‌ చేసుకోవాలి. ఆ తరువాత మొబైల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, కాప్చా నమోదుచేయాలి. అక్కడనున్న స్లాట్‌ బుకింగ్‌ లింక్‌ను క్లిక్‌ చేసి ముందుకెళ్లాల్సి ఉంటుంది. సేల్‌, మార్ట్‌గేజ్‌, గిఫ్ట్‌ లావాదేవీలు ఎంచుకునే వీలు ఉంటుంది. ఆస్తి వివరాలు, ఆస్తి ఉన్న ప్రాంతం, జిల్లా సబ్ రిజిస్ట్రర్‌ కార్యాలయాల వివరాలు నమోదు చేయాలి. తదుపరి దశలో ఆస్తికి సంబంధించిన వివరాలు, సర్వే నంబర్‌, ఫ్లాట్‌ నంబర్‌ సరిహద్దులు తదితరాలను నమోదు చేయాలి. మూడోదశలో మార్కెట్‌ రుసుము, రిజిస్ట్రేషన్‌ ఫీజు నిర్ధారణ అవుతుంది. ఆస్తి వివరాల ఆధారంగా రిజిస్ట్రేషన్‌ రుసుమును సాఫ్ట్‌వేర్‌ ఖరారు చేస్తుంది. స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ రుసుం, పాస్‌ పుస్తకం, కొరియర్‌ ఛార్జీలు ఉంటాయి. 

తదుపరి దశలో అమ్మకందారు వివరాలు చిరునామా నమోదు చేయాలి. అయిదో దశలో కొనుగోలు దారు వివరాలు, చిరునామా, ఆరోదశలో కొనుగోలుదారు కుటుంబ సభ్యుల వివరాలు పొందుపర్చాలి. ఏడో దశలో సాక్షుల పేర్లు చేర్చాలి. ఆ తరువాత డాక్యుమెంట్‌ను చూసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి అయ్యాక ఎనిమిదో దశలో అన్‌లైన్ లేదా చలానా ద్వారా నిర్దేశిత రిజిస్ట్రేషన్‌ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపు ప్రక్రియ పూర్తి అయ్యాక తొమ్మిదో దశలో స్లాట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

సమస్యలు తలెత్తితే...!
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆధార్‌ సంఖ్య ఇవ్వటం ఇష్టం లేనివారికి వేరే లింక్‌ను ఏర్పాటు చేశారు. ఓపెన్‌ ప్లాట్‌లకు ఆస్తిపన్ను అంచనాకు సంబంధించి సంఖ్య ఉండదు కాబట్టి పీటీఐఎన్‌ లేదా టీపీఐఎన్‌ సంఖ్య కోసం వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్లాట్‌కు సంబంధించిన అన్ని వివరాలతో పాటు, లే అవుట్‌ , హద్దులను పొందుపరిచి రిజిస్టర్డ్‌ డ్యాకుమెంట్‌ను జతపరచాల్సి ఉంటుంది. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వాటిని ప్రస్తావించేందుకు ఇష్యూస్‌ ట్రాకర్‌ పేరిట ప్రత్యేక లింక్‌ను ఇచ్చారు. ఎలాంటి లాగిన్‌ అవసరం లేకుండా నిషేధిత ఆస్తుల వివరాలు పొందే అవకాశాన్ని కల్పించారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన కార్యాలయంతో పాటు స్లాట్‌ల లభ్యతను తెలుసుకునే సదుపాయాన్ని వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని