ఇక్కడ ఏనుగులను దత్తత తీసుకోవచ్చు

తాజా వార్తలు

Published : 30/09/2020 01:39 IST

ఇక్కడ ఏనుగులను దత్తత తీసుకోవచ్చు

కార్యక్రమం ప్రారంభించిన మధ్యప్రదేశ్‌

భోపాల్ : వన్య ప్రాణి ప్రేమికులు ఏనుగులను దత్తత తీసుకునే కార్యక్రమానికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ రాష్ర్టంలోని బాంధవ్‌గఢ్‌ నేషనల్‌ పార్కులోని ఏనుగులను ఒకరోజు.. నెల.. సంవత్సరం పాటు దత్తత తీసుకోవచ్చు. ఈ కార్యక్రమం ప్రారంభంలో భాగంగా తొలుత 74 ఏళ్లు గల గౌతమ్‌, 69 ఏళ్ల వయస్సున్న తూఫాన్‌ అనే పేర్లు కలిగిన రెండు ఏనుగులను దత్తత తీసుకోవడానికి అనుమతి ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత వీటితో పాటు మరో 13 అందుబాటులో ఉంటాయని పార్కు అధికారులు తెలిపారు. ఏనుగు దత్తత కార్యక్రమంలో ఒక రోజుకు రూ. 500, సంవత్సరానికి రూ.1.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.  

 వీటిని నెల, సంవత్సరం పాటు దత్తత తీసుకున్న వారికి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తున్నారు. బాంధవ్‌గఢ్‌ నేషనల్‌ పార్కు, టైగర్‌ రిజర్వులో ఏటా సెప్టెంబరులో జరిగే ఏనుగుల రీజువెనేషన్‌ కార్యక్రమంలో వారు పాల్గొనవచ్చు. ఈ సందర్భంగా ఒక రోజు ఏనుగులను దగ్గరి నుంచి చూస్తూ వాటికి ఆహారం అందించవచ్చు. దీంతో పాటు వాటిని అర్థం చేసుకోడానికి ఈ ప్రత్యేక కార్యక్రమం మంచి అవకాశం అని ముఖ్య అధికారి అలోక్‌ కుమార్‌ తెలిపారు. గతంలో పార్కుకు వచ్చేవారు టైగర్‌ రిజర్వు చూడటానికి ఏనుగులపై సంచరించేవారు. దాని వల్ల వచ్చే ఆదాయాన్ని వాటి పోషణకు, ఆరోగ్య సమస్యలపై ఖర్చు చేసేవారు. ఈ దత్తత కార్యక్రమం వల్ల వచ్చే ఆదాయం ఏనుగుల పర్యవేక్షణకు ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని