చాడ కారు ధ్వంసం కేసులో ఇద్దరు అరెస్ట్‌

తాజా వార్తలు

Published : 14/09/2020 14:43 IST

చాడ కారు ధ్వంసం కేసులో ఇద్దరు అరెస్ట్‌

హైదరాబాద్‌: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి కారు ధ్వంసం వ్యవహారంలో ఆగంతకులను నారాయణగూడ పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టగా.. దాడికి పాల్పడింది పాతబస్తీ ఛత్రినాకకు చెందిన యువకులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దర్నీ అరెస్టు చేసినట్లు చెప్పారు. దాడికి గల కారణాలపై విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

హిమాయత్‌నగర్‌లోని మఖ్దూంభవన్‌ వద్ద నిలిపి ఉంచిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కారును ఆదివారం ఇద్దరు యువకులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో కారు అద్దాలు పగిలిపోయాయి. అడ్డుకోబోయిన భద్రతా సిబ్బంది సురేందర్‌పైనా దుండగులు దాడికి ప్రయత్నించారు. పార్టీ కార్యాలయం లోపలి నుంచి కార్యకర్తలు బయటకు వచ్చేసరికి వారు ద్విచక్రవాహనంపై పారిపోయారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మరో కారు అద్దాలనూ ఆ యువకులు ధ్వంసం చేశారు. ఘటనపై నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. 

ఇదీ చదవండి..
చాడ వెంకట్‌రెడ్డి కారుపై దుండగుల దాడి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని