ఏపీ పురపాలక చట్టానికి సవరణలు:ఆర్డినెన్స్‌ జారీ 

తాజా వార్తలు

Published : 25/03/2021 01:06 IST

ఏపీ పురపాలక చట్టానికి సవరణలు:ఆర్డినెన్స్‌ జారీ 

అమరావతి: ఏపీ పురపాలక చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆర్డినెన్స్‌ జారీ చేసింది. కొత్త సవరణలతో కార్పొరేషన్లలో ఇద్దరు డిప్యూటీ మేయర్లను, పురపాలిక, నగర పంచాయతీల్లో అదనపు వైస్‌ ఛైర్మన్లను ఎన్నుకునేందుకు ఈ ఆర్డినెన్స్‌ ఉపయోగపడనుంది. ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ బిశ్వభూషన్‌ ఆమోదం తెలిపారు.  

ఏపీలో ఇటీవల పురపాలికలకు, నగర కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే నగర కార్పొరేషన్లు, పురపాలికలు, నగర పంచాయతీలకు ప్రస్తుతం ఉన్న చట్టంతో అదనపు డిప్యూటీ మేయర్‌, వైస్‌ ఛైర్మన్లను నియమించేందుకు అనుమతి లేదు. దీంతో ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని