Anand Mahindra: లాక్‌డౌన్‌ ఎలా ఉందంటే..
close

తాజా వార్తలు

Published : 08/06/2021 01:18 IST

Anand Mahindra: లాక్‌డౌన్‌ ఎలా ఉందంటే..

ముంబయి: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను స్తంభింపజేసింది. అనేక దేశాలు ఆర్థికంగా క్షీణించిపోయాయి. మహమ్మారిని అరికట్టేందుకు అనేక దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే  ధైర్యంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. కాగా నిరాశలో ఉన్నవారికి నవ్వులు పంచేందుకు మరికొందరు ప్రయత్నిస్తున్నారు. సోషల్‌ మీడియాలో పలు వీడియోలు పోస్టు చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు.

సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుగ్గా ఉంటూ.. ఆలోచింపజేసే, నవ్వించే, వర్తమాన అంశాలను నెటిజన్లతో పంచుకునే వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా తాజాగా ఓ కామెడీ వీడియోను షేర్‌ చేశారు. ట్విటర్‌ వేదికగా పంచుకున్న ఆ టిక్‌టాక్‌ వీడియోలో.. ఓ యువకుడు ఇంటి తలుపులు మూసి తలుపునకు ఉన్న కొక్కానికి తాళాన్ని తాడుతో వేలాడదీసి కిందికీ, పైకి అంటూ ఉంటాడు. మరో వ్యక్తి ఏంచేస్తున్నావని అడగగా ‘లాక్‌-డౌన్‌’ అని సమాధానమిస్తాడు. కాగా ఈ వీడియోను పోస్టు చేస్తూ.. ఇదో సిల్లీ జోక్‌ అని, అయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లోనూ దేశ ప్రజల్లో హాస్య చతురత అలాగే ఉన్నందుకు సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ పరిస్థితి ఇలాగే ఉందని పేర్కొన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని