ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ

తాజా వార్తలు

Updated : 15/07/2020 17:09 IST

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ

సీఎస్‌ నేతృత్వంలో ఏర్పాటుకు కేబినెట్‌ భేటీలో నిర్ణయం


 

అమరావతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు సాయమందించేందుకు ఉద్దేశించిన వైఎస్సార్‌ చేయూత పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నాలుగేళ్లలో రూ.65వేలు ఇచ్చే ఈ పథకానికి సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో దీనికి ఆమోదం తెలిపినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ పథకం కింద మొత్తం 25 లక్షల మంది మహిళలకు పథకం వర్తిస్తుందని చెప్పారు. కేబినెట్‌ సమావేశంలో ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించారు.

44,500 పాఠశాలల్లో నాడు- నేడు పథకాన్ని 3 దశల్లో అమలుకు నిర్ణయించినట్లు పేర్ని నాని వెల్లడించారు. తొలి దశలో కేటాయించిన రూ.920 కోట్లకు అదనంగా మరో రూ.200 కోట్లు విడుదల చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. రాష్ట్రంలో 25 లేదా 26 జిల్లాలు ఏర్పాటు చేసేందుకు అధ్యయన కమిటీ ఏర్పాటుకు కేబినెట్‌ తీర్మానించింది. ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటు కానుంది. రాయలసీమ కరవు నివారణకు రూ.40వేల కోట్లతో కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు మంత్రి చెప్పారు. సీపీఎస్‌ రద్దు కోసం టీచర్లు చేసిన ఆందోళనపై పెట్టిన కేసులు రద్దు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గుంటూరులో పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారన్న కారణంతో ముస్లింలపై పెట్టిన కేసుల ఉపసంహరణకు నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

* ఇసుక అంశంపై ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏపీఎండీసీకి పనిభారం తగ్గించే దిశగా ఇసుక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇసుక మినహా మిగతా ఖనిజాల వ్యవహారాలన్నీ ఏపీఎండీసికి బదిలీ చేయనున్నారు. ఇసుక కార్పొరేషన్‌పై ముగ్గురు మంత్రుల కమిటీ పర్యవేక్షణ ఉంటుంది. ఇసుక వ్యవహారాలను ఎప్పటికప్పుడు కొడాలి నాని, పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డితో కూడిన కమిటీ పర్యవేక్షిస్తుంది.

* రాష్ట్రంలో 9,712 వైద్యుల పోస్టుల భర్తీకి కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. 5701 కొత్త పోస్టులు, 4011 పాత పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని