రఘురామవి తప్పుడు అభియోగాలు: సీఐడీ

తాజా వార్తలు

Updated : 07/06/2021 21:59 IST

రఘురామవి తప్పుడు అభియోగాలు: సీఐడీ

అమరావతి: తన మొబైల్‌ను సీఐడీ అధికారులు అక్రమంగా సీజ్‌ చేసి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ దిల్లీ పోలీసులకు నర్సాపురం ఎంపీ రఘురామ ఇచ్చిన ఫిర్యాదుపై ఏపీ సీఐడీ స్పందించింది. నిబంధనల ప్రకారమే ఎంపీ ఫోన్‌ను సీజ్‌ చేశామని తెలిపింది. సీజ్‌ చేసినప్పుడు తన నెంబరు 9000911111 అని చెప్పారని, ఫోన్‌లో ఏ నెంబరు ఉందో విచారణ అధికారికి తెలిసే అవకాశమే లేదని సీఐడీ వెల్లడించింది. సీజ్‌ చేసిన చరవాణిని గుంటూరు సీఐడీ కోర్టుకు అప్పగించినట్లు తెలిపింది. ‘‘ ఫోన్‌ను ప్రాథమిక విశ్లేషణ, డేటా, ఫొటోల, డంపింగ్‌కు ల్యాబ్‌కు పంపాం. ఫోన్‌ స్వాధీనానికి సంబంధించిన వివరాలను కోర్టు ముందుంచాం. మే 27న ఫోన్‌లో డంప్‌ చేసిన వివరాలను కోర్టుకు సమర్పించాం. విశ్లేషణ చేసిన డేటా వివరాలు మే 31న కోర్టుకు సమర్పించాం. సీజ్‌ చేసిన 9000922222తో మెసేజ్‌ పంపారని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. రఘురామ ఫోన్‌ మే 18 నుంచి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కస్టడీలో ఉంది. కస్టడీలో ఉన్న ఫోన్‌ను అధికారులు వాడే అవకాశం లేదు. ఎంపీ రఘురామ మాపై తప్పుడు అభియోగాలు చేస్తున్నారు’’ అని ఏపీ సీఐడీ వివరణ ఇచ్చింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని