కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను కలిసిన బుగ్గన
close

తాజా వార్తలు

Published : 24/06/2021 23:16 IST

కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను కలిసిన బుగ్గన

దిల్లీ: కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో భారత్‌ నెట్‌ పనులు వేగవంతం చేయాలని కేంద్రమంత్రిని బుగ్గన కోరారు. ప్రతి గ్రామాన్ని అంతర్జాలంతో అనుసంధానించాల్సి ఉందని, పీపీపీ పద్ధతిలో పనులు మొదలు పెట్టాలని కోరినట్లు బుగ్గన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎస్సీ కమిషన్‌ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని, జాతీయ లా వర్సిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

దిల్లీ పర్యటనలో ఉన్న బుగ్గన వరుసగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. గురువారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధులను విడుదల చేయాలని కోరినట్లు బుగ్గన తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని