ఆర్టీసీ కార్మికులకు రూ.50లక్షల కొవిడ్‌ బీమా!

తాజా వార్తలు

Published : 20/08/2020 01:02 IST

ఆర్టీసీ కార్మికులకు రూ.50లక్షల కొవిడ్‌ బీమా!

ఏపీ ఆర్టీసీ కీలక ఉత్తర్వులు

అమరావతి: ఆర్టీసీ కార్మికులకు రూ.50లక్షల కొవిడ్‌ బీమా ఇచ్చేందుకు యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీని కార్మికులకు వర్తింపజేస్తూ ఆదేశాలిచ్చింది. కరోనాతో ఇప్పటివరకు మృతి చెందిన 36మందికీ బీమా అమలయ్యేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు మృతుల వివరాలు సహా ధ్రువపత్రాలు పంపాలని ఆర్‌ఎంలను ఆర్టీసీ ఎండీ ఆదేశించారు. ఈ నెల 28లోపు ధ్రువపత్రాలను ప్రధాన కార్యాలయానికి పంపాలని సూచించారు. కరోనా బీమా వర్తింపజేయడంపై కార్మిక పరిషత్‌ సహా ఇతర సంఘాలు ఆర్టీసీ ఎండీకి ధన్యవాదాలు తెలిపాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని