Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (24-10-2021)

తాజా వార్తలు

Updated : 24/10/2021 05:30 IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (24-10-2021)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. కీలక వ్యవహారాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. సాయి చరిత్ర పారాయణ మంచిది.

ప్రారంభించే పనుల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. లక్ష్యసాధనలో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. విష్ణు సహస్రనామం చదివితే మంచిది.
 

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. హుషారుగా పని చేయాలి. అధికారులతో అతి చనువు వద్దు. అందరినీ సమభావంతో చూడటం వల్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి. గోసేవ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.
 

సంకల్పాలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఇష్టదైవారాధన శుభప్రదం.

అనుకూల సమయం. తోటి వారి సహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కొందరి ప్రవర్తన మీ మనసును చికాకు పరుస్తుంది. అకారణ కలహసూచన ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానకండి. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.  

శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. శత్రువులపై  నైతిక విజయం సాధిస్తారు. ముఖ్య విషయాల్లో అజాగ్రత్తగా ఉంటే వివాదాలు చుట్టుముడతాయి. ఎవరినీ అతిగా నమ్మకండి. శనికి తైలాభిషేకం శుభప్రదం.

ప్రయత్నకార్య సిద్ది కలదు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. విందు,వినోదాల్లో ఆనందంగా గడుపుతారు. బంధుప్రీతి కలదు. ఇష్టదైవ నామస్మరణ శుభాన్ని చేకూరుస్తుంది.
 

మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ధనధాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. తోటివారి సహకారంతో సత్పలితాలను సాధిస్తారు. లక్ష్మీనామాన్ని జపించడం ఉత్తమం.
 
 

మీ చిత్తశుద్దే విజయానికి మూలం అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విఘ్నాల్ని కలిగించేవారు పక్కనే ఉంటారు. ఆదిత్య హృదయం చదివితే మంచిది.
 

ఆత్మబలంతో ఒక పనిలో చక్కటి  ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

ప్రారంభించిన పని విజయవంతంగా పూర్తవుతుంది. బుద్ధిబలంతో సమస్యలు తొలుగుతాయి. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యలతో ఆనందాన్ని పంచుకుంటారు. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే మేలు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని