60 లక్షల మందితో 620కి.మీ. మానవహారం

తాజా వార్తలు

Published : 27/01/2020 01:52 IST

60 లక్షల మందితో 620కి.మీ. మానవహారం

సీఏఏపై కేరళలో వినూత్న నిరసన

తిరువనంతపురం: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వెంటనే రద్దు చేయాలన్న డిమాండ్‌తో కేరళ ప్రభుత్వం వినూత్న రీతిలో నిరసన తెలిపింది. రాష్ట్ర రాజధాని తిరువనంతపురం నుంచి  ఏకంగా 620 కిలోమీట్లర్ల మానవహారాన్ని ఏర్పాటు చేసి సీఏఏపై నిరసనను ప్రభుత్వ నిరసనను తెలియజేసింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సైతం ఈ మానవహారంలో పాల్గొన్నారు. ఉత్తర కేరళలోని కాసర్‌గోడ్‌ ప్రాంతం నుంచి మెదలైన మానవహారం ఏకంగా 620 కిలోమీటర్ల మేర సాగుతూ రాష్ట్రానికి దక్షిణ ప్రాంతంలో ఉన్న కళియక్కవిలాయ్‌ వరకు కొనసాగింది. ఈ మానవహారంలో దాదాపు 60 నుంచి 70 లక్షల మంది పాల్గొన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాసర్‌గోడ్‌లో సీనియర్‌ సీపీఐ (ఎం) నేత ఎస్‌.రామచంద్రన్‌ పిళ్లాయ్‌తో మొదలైన ఈ మానవహారం దక్షిణ కేరళలోని కళియక్కవిలాయ్‌లో ముగిసింది. విభిన్న రంగాలకు చెందిన అనేక మంది ఈ మానవహారంలో పాలుపంచుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని