ఒక్క రోజుకే పరిమితమైన బహిరంగ వ్యాయామశాల 

తాజా వార్తలు

Published : 27/02/2020 21:44 IST

ఒక్క రోజుకే పరిమితమైన బహిరంగ వ్యాయామశాల 

మహబూబ్‌నగర్‌: పురపాలక మంత్రి కేటీఆర్‌ పాలమూరులో ప్రారంభించిన బహిరంగ వ్యాయామశాల పట్టణ వాసులకు ఒక్క రోజుకే పరిమితమైంది. బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో పురుషుల కోసం ప్రత్యేకంగా ఈ నెల 24న ఈ వ్యాయామశాల ఏర్పాటు చేశారు. ప్రతి పురపాలిక పరిధిలో ఓపెన్‌ జిమ్‌ ఉండాలని, పాలమూరులో ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్‌ కల్వకుర్తిలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో పేర్కొన్నారు.  అయితే ప్రస్తుతం పరికరాలు అమర్చిన పునాదులే కనిపిస్తుండటం గమనార్హం. దీనిపై పురపాలక కమిషనర్‌ సురేందర్‌ను వివరణ కోరగా బోల్టులు సరిగా లేవని.. త్వరలో అన్ని పరికరాలు అమర్చుతామని వెల్లడించారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని