రైలు-ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కున్న ప్రయాణికుడు

తాజా వార్తలు

Published : 09/03/2020 01:29 IST

రైలు-ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కున్న ప్రయాణికుడు

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. విజయవాడకు చెందిన ఎలమందరావు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో నరసాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కే క్రమంలో జారి పడి ఫ్లాట్‌ఫాం, రైలు మధ్యలో చిక్కుకున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న సీజీపీ కానిస్టేబుల్‌ డేవిడ్‌ రాజు ఇతర ప్రయాణికుల సాయంతో అతడిని పైకి లాగారు. ఘటనలో స్వల్ప గాయాలతో బాధితుడు బయటపడ్డాడు. చాకచక్యంగా స్పందించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌ను అధికారులు అభినందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని