కరోనాపై విజయం.. మోదీపై 93% విశ్వాసం
close

తాజా వార్తలు

Published : 23/04/2020 19:18 IST

కరోనాపై విజయం.. మోదీపై 93% విశ్వాసం

కొవిడ్‌ సంక్షోభం నుంచి గట్టెక్కిస్తాడని

 93.5% భారతీయులకు ప్రధానిపై విశ్వాసం

ముంబయి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ సంక్షోభం నుంచి నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం భారతదేశాన్ని గట్టెక్కిస్తుందని 93.5% భారతీయులు విశ్వాసంతో ఉన్నారు. ముప్పు నుంచి దేశం సమర్థంగా బయటపడుతుందని ప్రజలు నమ్మకంతో ఉన్నారని గురువారం విడుదలైన ఓ సర్వే తెలిపింది.

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం ప్రభుత్వం మార్చి 25న మొదట 21 రోజుల లాక్‌డౌన్‌ విధించింది. ఆ తర్వాత దానిని మే 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ అమలు చేసిన తొలిరోజు ప్రధాని మోదీపై 76.8% ప్రజలు విశ్వాసంతో ఉన్నారని ఐఏఎన్‌ఎస్‌-సీ ఓటర్‌ సర్వే పేర్కొంది. ఏప్రిల్‌ 21న ఆ సంఖ్య 93.5 శాతానికి చేరిందని వెల్లడించింది. ‘కరోనా వైరస్‌ సంక్షోభాన్ని భారత ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోగలదా’ అని మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 21 వరకు ప్రజలను సర్వే ద్వారా ప్రశ్నించారు. మొదటి రోజు 75.8% ఉన్న విశ్వాసం ఏప్రిల్‌ 1కి 89.9శాతానికి చేరింది. తర్వాత మరింత పెరిగింది.

ప్రపంచ వ్యాప్తంగా నరేంద్రమోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. కఠిన సమయంలో భారతీయులను కాపాడటం ద్వారా అంతర్జాతీయ సమాజానికి సాయం చేస్తున్నారని ప్రపంచమంతా కొనియాడుతోందని వెల్లడించారు. ప్రతి భారతీయుడు మోదీ నాయకత్వంపై ధీమాగా ఉన్నాడని ట్వీట్‌ చేశారు. వివిధ దేశాధినేతలు మోరిసన్‌, బొల్సొనారో, ట్రూడో, మెర్కెల్‌, మేక్రాన్‌, అబే, లోపెజ్‌ ఒబ్రాడర్‌, బోరిస్‌ జాన్సన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌తో పోలిస్తే మోదీ 75% మార్కులతో అందరికన్నా ముందున్నారని ఓ సంస్థ అధ్యయనాన్ని ట్వీటుకు జతచేశారు.

చదవండి: న్యూయార్క్‌లో వెంటిలేటర్‌పై 90% మృతి

చదవండి: లాక్‌డౌన్‌ నుంచి వీటికి మినహాయింపు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని