కఠినంగా లాక్‌డౌన్‌: బెంగాల్‌కు కేంద్రం సూచన
close

తాజా వార్తలు

Published : 25/04/2020 18:16 IST

కఠినంగా లాక్‌డౌన్‌: బెంగాల్‌కు కేంద్రం సూచన

కోల్‌కతా: లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని పశ్చిమ్‌ బెంగాల్‌ ప్రభుత్వానికి కేంద్ర బృందాలు సూచించాయి. ఆ రాష్ట్ర కార్యదర్శి రాజీవ్‌సిన్హాకు లేఖ రాశాయి. ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ అమలు, ఉల్లంఘనలు, వ్యక్తిగత దూరం వంటి అంశాలను పర్యవేక్షించేందుకు ఈ బృందాలు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బెంగాల్‌కు రెండు బృందాలు వచ్చాయి. కోల్‌కతా, జల్పాయ్‌గుడిలో పర్యటించాయి.

బెంగాల్‌ ఉత్తర ప్రాంతంలో లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేసేందుకు ఎక్కువ మంది క్షేత్రస్థాయి అధికారులను మోహరించాలని ఆ కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న వినీత్‌ జోషి సూచించారు. అమలు చేసిన చర్యలు, ప్రభావంపై వీరు ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

‘కరోనా వైరస్‌ విజృంభించకుండా ఉండాలంటే లాక్‌డౌన్‌ను వెంటనే కఠినంగా అమలు చేయాలి. ప్రభుత్వానికి తెలియజేసేందుకు, లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేసేందుకు మరింత మంది క్షేత్రస్థాయి అధికారులు అవసరం’ అని జోషీ బెంగాల్‌ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.

బెంగాల్‌ ఉత్తర ప్రాంతంలో కొవిడ్‌-19 సన్నద్ధత వివరాలు తెలుసుకొనేందుకు సిలిగురి పోలీస్‌ కమిషనర్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఆ రాష్ట్రంలో కరోనాతో ఎక్కువ మంది చనిపోయినప్పటికీ లెక్కలు సరిగ్గా చూపించని సంగతి శుక్రవారం బహిర్గతమైన సంగతి తెలిసిందే.

చదవండి: బిస్కెట్లు తిని ఉంటున్నాం.. తీసుకెళ్లండి ప్లీజ్‌!

చదవండి: మూడో వ్యాక్సిన్‌కు చైనా అనుమతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని