రోడ్డుపైకి వస్తే దండేసి దండం పెడతారు..

తాజా వార్తలు

Published : 02/05/2020 14:09 IST

రోడ్డుపైకి వస్తే దండేసి దండం పెడతారు..

లుథియానా: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నప్పటికీ కొందరు వ్యక్తులు మాత్రం నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్లపైకి యథేచ్ఛగా వస్తున్నారు. అకారణంగా రోడ్లపైకి వాహనాలతో వస్తూ పోలీసుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. అలాంటి వారికి గుణపాఠం చెప్పేందుకు పంజాబ్‌ పోలీసులు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. రాష్ట్రంలోని లుథియానా పట్టణ పోలీసులు కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలో అనవసరంగా బయటకు వచ్చిన వారికి పూలదండలు వేసి సత్కారం చేస్తున్నారు. తాము విధులు నిర్వహించేది వారి క్షేమం కోసమేనని కనీసం ఈ చర్యతోనైనా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయం ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్‌ ఈ నెల 17 వరకు కొనసాగనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని