విశాఖ గ్యాస్‌ లీక్‌పై స్పందించిన ఏపీ హైకోర్టు

తాజా వార్తలు

Updated : 07/05/2020 16:53 IST

విశాఖ గ్యాస్‌ లీక్‌పై స్పందించిన ఏపీ హైకోర్టు

అమరావతి: విశాఖ గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై ఏపీ హైకోర్టు స్పందించింది. ఈ దుర్ఘటనను సుమోటోగా హైకోర్టు స్వీకరించింది. ఈ ఘటనను సుమోటోటా స్వీకరించడం అనేది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని.. ఈ దుర్ఘటన ప్రజల ప్రాణాలతో కూడుకున్న నేపథ్యంలోనే సుమోటోగా స్వీకరించినట్లు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే జనావాసాల మధ్య అలాంటి పరిశ్రమ ఎలా ఉందని న్యాయస్థానం విచారణ సందర్భంలో అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని అమికస్‌ క్యూరీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.

ఇవీ చదవండి..

మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం

స్టైరీన్‌ లీకేజీ.. విశాఖలో మహా విషాదంTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని